Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
లక్ష్మీ మంచు...తన బేబీతో ఇలా (ఫొటోలు)
హైదరాబాద్ : ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ లక్ష్మీ మంచు తల్లి అయ్యింది. ఇప్పుడు ఆ ఆనంద క్షణాలలో తేలియాడుతోంది. వాటిని మీడియాతో, సోషల్ నెట్ వర్కింగ్ లోని తన స్నేహితులతో పంచుకుంటూ మురిసిపోతోంది. తన బంగారు తల్లి ఫోటోలతో ఆ తల్లి ఫొటోలే అన్ని చోట్లా.
నటుడు, దర్శక, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె నటి మంచు లక్ష్మీ తల్లి అవటమే ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం. ఆదివారం ఫాదర్స్ డే రోజు తండ్రి మోహన్‌బాబును తాతను చేస్తూ ఆయనకు కానుకను ఆందించారు. నటనలోనే కాకుండా నిజ జీవితంలో లక్ష్మీ విలక్షణతను ప్రదర్శించారు. బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, షారూక్ ఖాన్ తరహాలో మంచు లక్ష్మీ కూడా సరోగసి ద్వారా ఆడ శిశువుకు జన్మ నిచ్చారు.
లక్ష్మీ ప్రసన్న ఈ విషయమై మాట్లాడుతూ... ఇది పూర్తి సరొగసీనే.. ఈ ప్రక్రియ కొంతవరకు హైదరాబాద్‌లో జరిగాక, సరొగేట్ మామ్ గర్భంలో పెట్టడం కోసం గుజరాత్‌కి వెళ్లాం. మొదట ఇదంతా హైదరాబాద్‌లోనే చేయించుకోవాలనుకున్నా. కానీ, మీడియాకు తెలిసిపోతుందన్న భయంతో వద్దనుకున్నాను అన్నారు.
స్లైడ్ షో లో...తల్లీ బిడ్డ...
పాపకి పేరు..
ఈ ముద్దుల పాపకి ...తమ కుటుంబంలో అందరి పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది.
ఈ ప్రాసెస్ అంతా..
ఈ పద్దతి లో కొంత హైదరాబాద్ లో జరిగాక, సరొగేట్ మామ్ గర్బంలో పెట్టడం కోసం గుజరాత్ కి వెళ్లాం. మొదట ఇదంతా హైదరాబాద్ లో నే చేయించుకోవాలనుకున్నాం. కానీ మీడియా భయంతో వద్దనుకున్నాం అన్నారామె.
కేవలం వాళ్లిద్దరికే...
ఈ రహస్యం అంతా బేబీ బయిటకు వచ్చే రెండు మూడు రోజులు ముందు మాత్రం క్లోజ్ ప్రెండ్స్ ప్రకాష్, రానా కి చెప్పానని చెప్పారామె.
అంతా లీగల్...
ఈ సరోగసి పద్దతి అంతా లీగల్ గానే జరుగుతుందని,పక్కా పేపర్ వర్క్ ఉంటుదని చెప్పారామె. ఇతర దేశాలకన్నా మన దేశంలోనే పక్కాగా దీనికి చట్టాలు ఉన్నట్లు వివరించారామె.
మొక్కులు మొక్కా
ఈ బేబీ కోసం నేను ఎన్ని మొక్కులు మొక్కి ఉంటానో, ఎన్ని గుళ్ళకు వెళ్లి ఉంటానో, ఎంతగా ఆధ్యాత్మికంగా తయారయ్యానో అన్నారామె.