» 

ముసుగేసుకుని ఓల్డ్ సిటీలో తాప్సి, మంచులక్ష్మి(ఫోటో)

Posted by:
Give your rating:

హైదరాబాద్ : 'ఝుమ్మంది నాదం' చిత్రంలో మంచు మనోజ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ.....అప్పటి నుంచి మంచు ఫ్యామిలీకి చాలా క్లోజైన సంగతి తెలిసిముందే. ముఖ్యంగా మంచు లక్ష్మితో తాప్సీకి చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది. మంచు ఫ్యామిలీతో ఉన్న సాన్నహిత్యం కారణంగానే ఆమె ఆ తర్వాత విష్ణుతో 'వస్తాడు నారాజు' చిత్రంలో నటించింది.

ఇటీవల మంచు లక్ష్మి నిర్మించిన 'గుండెల్లో గోదారి' చిత్రంలోనూ తాప్సీ అతిముఖ్యమైన గ్లామరస్ రోల్ పోషించింది. ఈ వివరాలు చాలు మంచు లక్ష్మి, తాప్సి మధ్య ఎంత మంచి స్నేహం ఉందో. ఇవే కాక పలు సినిమా ఫంక్షన్లు, ప్రైవేటు ఫంక్షన్లలోనూ ఇద్దరూ కలిసి సందడి చేసారు.

అయితే ఇప్పుడు ఈ సోదంతా ఎందుకని అనుకుంటున్నారా?......ఇటీవల ఈ క్లోజ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గల చార్మినార్ వద్దగల బ్యాంగిల్ బజార్‌లో తిరిగి సందడి చేసారు. షాపింగ్ చేసి తమకు నచ్చిన వస్తువులు వెంట తీసుకెళ్లారు. అయితే తమను అంతా గుర్తు పడితే ఇబ్బందుల్లో అవకాశాలు ఉండటంతో మొహానికి ముసుగు వేసుకున్నారు. జనాలు వారిని గుర్తు పట్టి చుట్టూ చేరితే....పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పని, అదీ పాతబస్తీ లాంటి రద్దీ ఏరియాలో చేయడం అంటే సాహసమే.

Read more about: laxmi prasanna, tapsi, gundello godari, లక్ష్మీ ప్రసన్న, తాప్సీ, గుండెల్లో గోదారి
English summary
Manchu Lakshmi and Taapsee recently visited the bangle market in the old city at Charminar area. As it is a big tough for a heroines of this stature to go and do hungama there, both Lakshmi and Tapsee have worn veils to make their adventure interesting.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive