» 

లక్ష్మీ మంచు కుమార్తె పేరు...ఫొటోలు

Posted by:

హైదరాబాద్ : ఇటీవలే లక్ష్మీ ప్రసన్న సరోగసీ విధానం ద్వారా తల్లయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆనంద క్షణాల్ని మంచు లక్ష్మీ ప్రసన్న అనుభవిస్తోంది. ఆమె గారాల పట్టికి 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌' అనే పేరు పెట్టారు. ఈ చిన్నారికి 21 రోజులు నిండిన సందర్భంగా మంచు లక్ష్మి తన కుమార్తె ఫొటోలను విడుదల చేశారు. ఆ ముద్దులొలికే రూపం.. మీరూ చూడండి

ఎవరూ ఊహించని విధంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ లక్ష్మీ మంచు తల్లి అయ్యింది. ఇప్పుడు ఆ ఆనంద క్షణాలలో తేలియాడుతోంది. వాటిని మీడియాతో, సోషల్ నెట్ వర్కింగ్ లోని తన స్నేహితులతో పంచుకుంటూ మురిసిపోతోంది. తన బంగారు తల్లి ఫోటోలతో ఆ తల్లి ఫొటోలే అన్ని చోట్లా.

నటుడు, దర్శక, నిర్మాత మోహన్‌బాబు కుమార్తె నటి మంచు లక్ష్మీ తల్లి అవటమే ఇప్పుడు అందరిలో చర్చనీయాంశం. ఆదివారం ఫాదర్స్ డే రోజు తండ్రి మోహన్‌బాబును తాతను చేస్తూ ఆయనకు కానుకను ఆందించారు. నటనలోనే కాకుండా నిజ జీవితంలో లక్ష్మీ విలక్షణతను ప్రదర్శించారు. బాలీవుడ్ నటులు అమీర్‌ఖాన్, షారూక్ ఖాన్ తరహాలో మంచు లక్ష్మీ కూడా సరోగసి ద్వారా ఆడ శిశువుకు జన్మ నిచ్చారు.

లక్ష్మీ ప్రసన్న ఈ విషయమై మాట్లాడుతూ... ఇది పూర్తి సరొగసీనే.. ఈ ప్రక్రియ కొంతవరకు హైదరాబాద్‌లో జరిగాక, సరొగేట్ మామ్ గర్భంలో పెట్టడం కోసం గుజరాత్‌కి వెళ్లాం. మొదట ఇదంతా హైదరాబాద్‌లోనే చేయించుకోవాలనుకున్నా. కానీ, మీడియాకు తెలిసిపోతుందన్న భయంతో వద్దనుకున్నాను అన్నారు.

స్లైడ్ షో లో...తల్లీ బిడ్డ...

పాపకి పేరు..

ఈ ముద్దుల పాపకి ...తమ కుటుంబంలో అందరి పేర్లు కలిసి వచ్చేలా పేరు పెట్టాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. అలా ఆమె భావించినట్లే కుమార్తెకు 'విద్యా నిర్వాణ మంచు ఆనంద్‌' అని పెట్టారామె

 

ఈ పద్దతి అంతా..

లక్ష్మీ ప్రసన్న మాట్లాడతూ.... ఈ పద్దతి లో కొంత హైదరాబాద్ లో జరిగాక, సరొగేట్ మామ్ గర్బంలో పెట్టడం కోసం గుజరాత్ కి వెళ్లాం. మొదట ఇదంతా హైదరాబాద్ లో నే చేయించుకోవాలనుకున్నాం. కానీ మీడియా భయంతో వద్దనుకున్నాం అన్నారామె.

 

పక్కాగానే...

ఈ సరోగసి పద్దతి అంతా లీగల్ గానే జరుగుతుందని,పక్కా పేపర్ వర్క్ ఉంటుదని చెప్పారామె. ఇతర దేశాలకన్నా మన దేశంలోనే పక్కాగా దీనికి చట్టాలు ఉన్నట్లు వివరించారామె.

 

ఆధ్యాత్మికంగా...

ఈ బేబీ కోసం నేను ఎన్ని మొక్కులు మొక్కి ఉంటానో, ఎన్ని గుళ్ళకు వెళ్లి ఉంటానో, ఎంతగా ఆధ్యాత్మికంగా తయారయ్యానో అన్నారామె. ఈ రహస్యం అంతా బేబీ బయిటకు వచ్చే రెండు మూడు రోజులు ముందు మాత్రం క్లోజ్ ప్రెండ్స్ ప్రకాష్, రానా కి చెప్పానని చెప్పారామె.

 

Read more about: manchu laxmi prasanna, anaganaga oka dheerudu, gundello godari, మంచు లక్ష్మి ప్రసన్న, అనగనగా ఓ ధీరుడు, గుండెల్లో గోదారి
English summary
Lakshmi disclosed, “Alright alright... Going to reveal my goddesses name and picture. Keep your blessings ready. Vidya Nirvana Manchu Anand.”
Please Wait while comments are loading...