twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రిష్‌కు దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఓపెన్ లెటర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : దసరా కానుకగా విడుదలైన క్రిష్ చిత్రం 'కంచె'. ఈ చిత్రంకు సినిమా అభిమానుల నుంచి అభినందనలు అందుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో మరో దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని చూసి తన అభిప్రాయాన్ని ఓపెన్ లెటర్ గా వ్యక్తీకరించారు. ఆ ఉత్తరాన్ని మీరు ఇక్కడ చూసి, ఆయనేం రాసారో చదువుకోవచ్చు.

    Letter to director Krish from Mohana Krishna Indraganti

    చిత్రం కథేమిటంటే...

    రెండు విభిన్న కథలను ఒకే బ్యాక్ డ్రాప్ లో చెప్పాలని ప్రయత్నించిన చిత్రం ఇది. ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ) రెండో ప్రపంచ యుద్దం(1944)లో జర్మనీకి వ్యతిరేకంగా పోరాడే ఓ సైనికుడు. అతని కమాండర్ ఈశ్వర్ (నిక్తిన్ ధీర్). ఓ సమయంలో జర్మన్ ఆర్మీ దాడి జరిపి..ఈశ్వర్ ని అతనితో పాటు ఉన్న వారిని ఎత్తుకుపోతారు. అయితే హరిబాబుకు , కమాండర్ ఈశ్వర్ కు ఇంతకు ముందే(1936) పరిచయం ఉంటుంది.

    ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే...రాచకొండ సంస్దానాధినేత ఈశ్వర్ కు ఓ చెల్లెలు సీతాదేవి(ప్రగ్యాజైస్వాల్). సీతాదేవి, హరిబాబు ప్రేమించుకుంటారు. అయితే హరిబాబుది నిమ్న కులం కావటంతో ఊళ్లో గొడవలు భగ్గుమంటాయి. వారి ప్రేమ ప్రక్కన పెడితే ఇప్పుడు హరిబాబు... తన కమాండర్ ని,మిగతా వారిని రక్షించాడా..లేక గతం గుర్తు పెట్టుకుని వదిలాసాడా....సీతాదేవితో హరిబాబు ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా సినిమా.

    Letter to director Krish from Mohana Krishna Indraganti

    తొలి చిత్రం గమ్యం నుంచీ దర్శకుడు క్రిష్..విభిన్న తరహా కధాంశాలకే ఓటు వేస్తూ వచ్చాడు. అలాగే ఈ సారి కూడా సెకండ్ వరల్డ్ వార్ నేపధ్యం తీసుకుని అక్కడ విద్వేషాల కంచెను చూపుతూ...దానికి ప్యారలల్ గా మన ఊళ్లను ముడిపెడుతూ ఇక్కడ ఊళ్ల మధ్య కులాల కంచె ఉందని ..ఈ రెండిటినీ విడిచిపెడితేనే మనిషి ప్రశాంతంగా బ్రతుకుతాడని చెప్పాలనే ఆలోచనతో చేసాడు.

    మరీ ఆరు పాటలు, ఐదు ఫైట్స్, బ్రహ్మానందం కామెడీ అనే రొటీన్ తెలుగు సినిమాకు ఇది మాత్రం ఆసక్తి కలిగించే కొత్త పరిణామం. ఇందుకు దర్శక,నిర్మాతలను అభినందించాలి. ముఖ్యంగా అప్పటి భారతదేశాన్ని చూడాలనుకునేవారికి ఇది బాగా నచ్చుతుంది.

    English summary
    Indraganti Mohanakrishna has now written an open letter to Krish lauding his passion for narrating socially responsible films in the times when audiences are used to watching crass comedy and illogical films that are full of worthless dances and fights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X