twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్‌: ఇండియా ఎంట్రీ 'లయర్స్‌ డైస్‌' కథ ఇదీ

    By Srikanya
    |

    ముంబై: 2015 ఆస్కార్‌ ఎంట్రీ కోసం ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో 'లయర్స్‌ డైస్‌' ఎంపికైన సంగతి తెలిసిందే. మొత్తం ఈ ఎంట్రీ కోసం 30 సినిమాలు పోటీపడ్డాయి. తప్పిపోయిన తన భర్తను వెతుక్కొంటూ బయలుదేరిన ఓ గిరిజన మహిళ కథ ఇది. గీతాంజలి తప, నవాజుద్దీన్‌ సిద్దిఖీ ప్రధాన పాత్రలు పోషించారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకుడు. ఆస్కార్‌ ఎంట్రీకు ఎంపికైన విషయాన్ని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా సెక్రటరీ జనరల్‌ సుప్రన్‌ సేన్‌ వెల్లడించారు. ఈ చిత్రం కథ ఇదీ...

    ఇండో -టిబెటియన్‌ సరిహద్దుల్లోని ఓ మారుమూల గ్రామంలో ఓ గిరిజన యువ జంట నివసించేది. ఓ పనిమీద భర్త ఢిల్లీ వెళతాడు. కొన్ని నెలలు గడిచినా తిరిగిరాడు. అతడి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతడి భార్య ఢిల్లీకి తన కూతుర్ని వెంటపెట్టుకొని బయలుదేరుతుంది. మార్గం మధ్యలో ఆమెకు ఆర్మీలో పనిచేసే ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆమె కథ తెలుసుకొని సహాయపడాలని నిశ్చయించుకొంటాడు. ఆమెతోపాటు ఆ ఆర్మీ వ్యక్తి ఢిల్లీ బయలుదేరుతాడు.

     Liar's Dice is India's official Oscars pick Story

    ఆ తర్వాత ఆమె తన భర్తను ఎలా కలుసుకొంది? అనేది మిగిలిన కథ. వివిధ చిత్రోత్సవాల్లో ఈ చిత్రం అవార్డులు దక్కించుకొంది. ఈ చిత్రంలోని నటనకు గీతాంజలి తపకు ఉత్తమ నటిగా, రాజీవ్‌ రవికు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశానికి ఆస్కార్‌ దక్కలేదు. అప్పట్లో 'లగాన్‌' చిత్రం తొలి ఐదు నామినీస్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. 87వ ఆస్కార్‌ అవార్డు వేడుకలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న జరగనున్నాయి.

    ఆస్కార్ బరిలో నిలిచేందుకు తెలుగు నుండి పోటీ పడ్డ ‘మనం', ‘మినుగురులు' చిత్రాలకు నిరాశే ఎదురైంది. బెంగాళీ చిత్రం జతీశ్వర్, మరాఠీ చిత్రం ఫండ్రీ, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ చిత్రం షాహిద్‌లు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే మర్ధానీ, ఫిల్మీస్దాన్, సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా, మేరీ కోమ్ కూడా ఉన్నాయి. ఇక తమిళం నుంచి కొచ్చడయనా, కదై తిరక్కదై వసనమ్ ఇయక్కమ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని కొంకణీ చిత్రాలు కూడా రేసులో నిలిచినాయి.

    English summary
    Liar's Dice (2014) story... follows Kamala, a young woman from Chitkul village and her girl child Manya, who embarks on a journey leaving their native land in search for her missing husband. Along this journey she encounters Nawazudin, a free spirited army deserter who helps them to get to their destination with his own selfish motive.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X