»   » ప్రియుడితో నా పెళ్లి.... ముద్దు ఫోటో పోస్టు చేసిన హీరోయిన్!

ప్రియుడితో నా పెళ్లి.... ముద్దు ఫోటో పోస్టు చేసిన హీరోయిన్!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్‌ బ్యూటీ లీసా హెడెన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ... తన ప్రియుడి ఫోటోను పోస్టు చేసింది ఈ చెన్నై చిన్నది. ఈ ఫోటో కూడా మామూలుగా లేదు సుమీ. ఇద్దరు ఒకరి పెదాలను ఒకరు గాడంగా ముద్దాడుతున్న ఫోటోను పోస్టు చేసి త్వరలో ఇతన్నే పెళ్లాడబోతున్నట్లు ప్రకటించింది.

2010లోనే బాలీవుడ్లో నటిగా అడుగు పెట్టినా... చెప్పుకోదగ్గ హిట్ సినిమాలే లీసా హెడెన్ ఖాతాలో లేవు. ఈ ఏడాది రిలీజైన 'హౌస్‌ఫుల్ 3' సినిమా లీసా కెరీర్లో చేసిన పెద్ద సినిమా. అయితే నటిగా గుర్తింపు లేక పోయినా...మోడలింగ్ రంగంలో తన అందాల ఆరబోత ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలోని ప్రముఖ మేగజైన్లింటిపైనా లీసా హాట్ ఫోటోస్ ప్రచురించబడ్డాయి.

ఎవరిని పెళ్లాడబోతోంది?

డినో లాల్వానీ అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతోంది లీసా హెడెన్0. పాకిస్థాన్‌లో పుట్టిన బ్రిటిష్‌ వ్యాపారవేత్త గుల్లు లాల్వానీ కుమారుడే ఈ డినో లల్వానీ. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు.

అందరికీ తెలిసి విషయమే

డినో, లీసాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. లీసా సోషల్‌మీడియా ద్వారా తరచూ డినోతో కలిసి దిగిన ఫొటోలు పోస్ట్‌ చేస్తూనే ఉంది. ఇప్పుడు పెళ్లి విషయమై లీసా కాస్త వెరైటీగాడినోని ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఇతన్ని పెళ్లిచేసుకుంటున్నా'' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది.

కుర్రాడి స్థితిగతులేంటి?

డినో లల్వానీ తన తండ్రి ప్రారంభించిన బినాటోన్‌ టెలికాం కంపెనీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. అంటే బాగా ధనవంతమైన కుటుంబానికి చెందిన వాడే అన్నమాట.

లీసా హెడెన్

లీసా హెడెన్ అసలు పేరు ఎలిసబెత్ మరీ హెడెన్. తర్వాత తన పేరును లీసా హెడెన్ గా మార్చుకుంది.

చెన్నైలో...

లీసా హెడెన్ పుట్టింది చెన్నైలోనే. 17 జూన్, 1986లో జన్మించింది.

విదేశాల్లోనే..

లీసా హెడెన్ పుట్టంది చెన్నైలోనే అయినా 2010లో సినిమాల్లోకి అడుగు పెట్టే వరకు ఆస్ట్రేలియా, అమెరికాల్లో పెరిగింది.

 

18 ఏళ్ల వయసులోనే

18 ఏళ్ల వయసులో లీసా హెడెన్ యోగా టీచర్ అవ్వాలనుకుంది. తర్వాత స్నేహితుల సలహాతో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.

మోడలింగ్ కెరీర్

ఆస్ట్రేలియాలోనే.. లీసా హెడెన్ ఆస్ట్రేలియాలోనే తన మోడలింగ్ కెరీర్ మొదలు పెట్టింది.

 

భారత్ కు

లీసా హెడెన్ సోదరి మల్లికా హెడెన్ కూడా ఇండియాలో మోడలింగ్ రంగంలోనే ఉండటంతో 2007లో లీసా కూడా ఇండియా వచ్చింది.

ఫ్యాషన్

విల్స్ లైఫ్ స్టైల్ ఇండియా ఫ్యాషన్ వీక్ తో పాటు పలు ఫ్యాషన్ షోలలో అందాలు ప్రదర్శించింది.

యాడ్స్

హ్యుందర్ ఐ 20, ఇండిగో నేషన్, మంత్రా డాట్ కామ్, బ్లెండర్స్ ప్రైడ్ లాంటి ప్రకటన్లో నటించింది.

బాలీవుడ్లో

2010లో ఏసా సినిమా ద్వారా లీసా హెడెన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

 

కంగనాతో కలిసి

కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్వీన్ మూవీలో లీసా ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

చిన్న పాత్రలే

పలు బాలీవుడ్ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడంతో లీసాకు పెద్దగా గుర్తింపురాలేదు.

ఇదే పెద్ద అవకాశం

హౌస్ ఫుల్ 3 మూవీలో ముగురు హీరోయిన్లలో ఒకరిగా అవకాశం దక్కించుకోవడం లీసా ప్లస్ పాయింటుగా చెప్పుకోవచ్చు.

 

అలాంటి పాత్రలే

లీసా మోడ్రన్ డ్రెస్సులు, ఆ తరహా ఆటిట్యూడ్ ప్రదర్శించే పాత్రలకు మాత్రమే సెట్టయ్యే ఫిక్ మాత్రమే ఉండటంతో అలాంటి పాత్రలు ఉండే సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి.

ఒంపు సొంపులు

బికినీ బాడీ లీసా బాడీ షేపులు బికినీ ధరించడానికి అనువైనదిగా ఉంటుంది

 

అదే మైనస్

సెక్స్ అప్పీల్ అయితే ఆమె ఫిజిక్ లో సెక్స్ అప్పీల్ లేక పోవడంతో పెద్ద మైనస్

 

చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం ప్రస్తుతం ఆమె యే దిల్ హై ముష్కిల్, బాద్ షా హో సినిమాల్లో నటిస్తోంది.

 

పార్టీ గర్ల్

లీసా హెడన్ కు పార్టీ గర్ల్ గా పేరుంది. ఆమె ఉంటే సినిమా షూటింగులో లేదా ఏదైనా పార్టీలో, లేదే విదేశాల్లో షూటింగులో ఉంటుందనే పేరుంది.

English summary
Lisa Haydon's Instagram account is full of pictures that document her whirlwind romance with Dino Lalvani. However, she had a surprise in store for her fans when she announced her engagement on the social photo sharing platform.
Please Wait while comments are loading...