twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ ఎన్టీఆర్‌కు అలా అవార్డు ఇచ్చి...ఇలా రైట్స్ లాగేసారు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఆ మధ్య మాటీవీ ఆధ్వర్యంలో జరిగిన.... 'మా'సినీ అవార్డుల వేడుకలో జూ ఎన్టీఆర్‌ను 'ఉత్తమ అవార్డు'తో సత్కరించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే... ఇపుడు జూ ఎన్టీఆర్ నటిస్తున్న 'జనతా గ్యారేజ్' సినిమాను మాటీవీ వారే దక్కించుకున్నారు.

    జూ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్, దర్శకుడు కొరటాల శివ స్టామినాను బేరీజు వేసి మాటీవీ వారు 'జనతా గ్యారేజ్' శాటిలైట్ రైట్స్ రూ. 12.5 కోట్లుకు కొనుగోలు చేసారట. వాస్తవానికి ఈ సినిమా రైట్స్ జెమినీ టీవీకి దక్కుతాయని అనుకున్నారు.. చివరకు మాటీవీ దక్కించుకుంది.

    ఎన్టీఆర్‌కు అలా అవార్డు ఇచ్చేసి... ఇలా శాటిలైట్ రైట్స్ గుంజేసారు.. మాటీవీ స్ట్రాటజీ మామూలుగా లేదు అంటున్నారు సినీ జనాలు. నిజంగానే తెర వెనక అలాంటివేమైనా జరిగాయా? అంటే చెప్పడం కష్టమే. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ వారు మాత్రం అలాంటి దేమీ లేదు...మాటీవీ వారే ఎక్కువ మొత్తం బిడ్ వేసారు అందుకే వారికి దక్కింది అంటున్నారు.

    Maa TV bags NTR janatha garage satellite rights

    జనతా గ్యారేజ్ సినిమాను సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. సమంత, నిత్యామీనన నాయికలు, మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన ఎర్నేని, మోహన, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

    నిర్మాతలు మాట్లాడుతూ ''టాప్‌ టెక్నీషియన్లు, ఆర్టిస్ట్ లు పని చేసిన ఈ చిత్రం అందరూ గర్వపడేలా ఉంటుంది. ఆగస్ట్‌ ఒకటి లేదా రెండో వారంలో పాటల్ని విడుదల చేసి, సెప్టెంబర్‌ 2న సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వెల్లడించారు.

    English summary
    As per the latest news we hear, the satellite rights of Janatha Garage have been sold out for a whopping price of Rs 12.5 crores which is highest among Tarak’s films. Admist huge competition, the satellite rights deal has been closed by MAA TV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X