twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమే... మంచు మనోజ్ చాలా ఓవర్ చేసాడు, అక్క వద్ద బాధపడి..!

    ఎప్పుడైనా సినిమా టీవీలో వస్తే అస్సలు చూడాలనిపించదు, అందులో నేను కొన్ని సీన్లలో చాలా ఓవర్ గా చేసానని అని అనిపిస్తుంటుంది అన్నారు మనోజ్.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మంచు మనోజ్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో 'పోటుగాడు' సినిమా ఒకటి. అయితే ఆ సినిమాలో మనోజ్ కొన్ని సీన్లలో కాస్త ఓవర్ చేసాడనే విమర్శలు కూడా అప్పట్లో వచ్చాయి. తన తాజా సినిమా 'గుంటూరోడు' సినిమా ప్రమోషన్లో పాల్గొన్న మనోజ్..... స్వయంగా తన ఓవర్ యాక్షన్ గురించి నోరు విప్పాడు.

    గుంటూరు ప్రమోషన్లో ఉండగా మనోజ్ కు ఓ ప్రశ్న ఎదరైంది. మీరు ఎందుకు ఈ మధ్య ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ చిత్రాలు చేయడం లేదు అనే ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ.... కమర్షియల్ చిత్రాలన్నీ సక్సెస్ అవుతాయా? అంటూ ఎదురు ప్రశ్నించారు.

     చాలా ఓవర్ చేసాను

    చాలా ఓవర్ చేసాను

    తన కెరీర్లో మంచి కమర్షియల్ హిట్ సినిమా అయిన పోటుగాడు గురించి మాట్లాడుతూ...పొటుగాడు సినిమా నా కెరీర్‌లో మంచి హిట్‌. ఎప్పుడైనా సినిమా టీవీలో వస్తే అస్సలు చూడాలనిపించదు, అందులో నేను కొన్ని సీన్లలో చాలా ఓవర్ గా చేసానని అని అనిపిస్తుంటుంది అన్నారు.

     చాలా బాధ పడ్డాను

    చాలా బాధ పడ్డాను

    ఆ సినిమాలో కొన్ని సీన్లు చేసి ఇంటికొచ్చి బాధపడేవాణ్ని. లక్ష్మి అక్కతో నా బాధ పంచుకునేవాణ్ని. నాకూ కమర్షియల్‌ హిట్‌ ఉండాలనే ఒత్తిడితోనే ఆ సినిమా చేశాని మనోజ్ చెప్పుకొచ్చారు.

     సంతృప్తినిచ్చిన సినిమాలు

    సంతృప్తినిచ్చిన సినిమాలు

    నా కెరీర్లో నేను చేసిన వేదం, ప్రయాణం సినిమాలు చాలా సంతృప్తిని ఇచ్చాయి. ఆ సినిమాలను భవిష్యత్తులో నా పిల్లలకు గర్వంగా చూపెట్టుకుంటాను అని మనోజ్ చెప్పుకొచ్చారు.

     నాన్నకి, అమ్మకి, భార్యకి కథలు చెప్పమని చెప్పను

    నాన్నకి, అమ్మకి, భార్యకి కథలు చెప్పమని చెప్పను

    మీరు ఒప్పుకునే ప్రాజెక్టులపై డిసిషన్ మేకర్స్ ఎవరు? అనే ప్రశ్నకు మనోజ్ స్పందిస్తూ... ఎవరైనా దర్శకులు, రచయితలు కథలు చెప్పడానికి వస్తే మా నాన్నకో, మా అమ్మకో, భార్యకో కథలు చెప్పమని అస్సలు చెప్పను. నాకు కథ నచ్చితే చేస్తాను అంతే అని మనోజ్ తెలిపారు.

    కెలకొద్దు

    మంచు మనోజ్ హీరోగా నటించిన గుంటూరోడు చిత్రం మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయిక. ఎస్‌.కె.సత్య దర్శకుడు. ఈ సందర్భంగా 'గుంటూరోడు' చిత్ర యాక్షన్‌ ట్రైలర్‌ను మనోజ్‌ అభిమానులతో పంచుకున్నారు. 'కన్నాగాడిని కెలికితే దెబ్బ ఎలా ఉంటుందో' ప్రత్యర్థులకు ట్రైలర్లో రుచి చూపించేశారు మంచు మనోజ్‌.

     చిరంజీవి

    చిరంజీవి

    గుంటూరోడు చిత్రంలో కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు మెగాస్టార్ చిరంజీవి తన మాస్ స్టైల్‌లో వాయిస్ ఓవర్ ఇచ్చారని చిత్ర దర్శకుడు సత్య తెలియచేసారు. అనంతరం హీరో మంచు మనోజ్ బాబు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా ఆనందంగా వుందని, ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీం అందరి తరుపన స్పెషల్ థాంక్స్ తెలియచేస్తున్నామని తెలిపారు.

     నటీనటులు

    నటీనటులు

    మంచు మనోజ్ సరసన కథానాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, కోటశ్రీనివాసరావు, రావు రమేష్ , సంపత్, పృథ్వి ,ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

     తెర వెనక

    తెర వెనక

    సాంకేతిక వర్గం .. సంగీతం: శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి : సిద్దార్ధరామస్వామి, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్ : వెంకట్ , కొరియోగ్రాఫర్ : శేఖర్, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి , భాస్కరభట్ల, శ్రీ వసంత్, కో- డైరెక్టర్ అర్జున్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి, పోస్ట్ ప్రొడక్షన్ సూపర్ వైజర్ జి.వి.రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత : శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం : ఎస్.కె సత్య.

    English summary
    "Potugadu is the biggest commercial hit. When I watched it on TV, I felt like...why did I do so much of over-action? I used to feel bad after the day's shoot while working for that project." Machu Manoj said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X