»   » మేడమ్ టుస్సాడ్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు?

మేడమ్ టుస్సాడ్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మేడమ్ టుస్సాడ్స్ వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, సినీ సెలబ్రిటీల మైనపు విగ్రహాలను లండన్, బ్యాంకాక్, హాంకాంగ్, సింగపూర్ లలో ఏర్పాటు చేసి తమ మ్యూజియంలలో ప్రతిష్టిస్తున్న సంగతి తెలిసిందే. అచ్చం మనిషిని పోలి ఉండే ఈ విగ్రహాల తయారీకి కూడా ఖర్చు భారీగానే అవుతుంది. ఒక్కో విగ్రహం తయారీకి లక్షా యాభై వేల బ్రిటిష్ పౌండ్లు ఖర్చవుతున్నాయి. అంటే మన కరెన్సీలో ఒక్కో విగ్రహం తయారీకి అయ్యే ఖర్చు దాదాపు రూ. కోటిన్నర...

మన దేశ ప్రధాని మోడీ విగ్రహాన్ని ఈ ఏడాది ఏప్రిల్ లో మేడమ్ టుస్సాడ్స్ లో ప్రతిష్టించారు. లండన్, బ్యాంకాక్, సింగపూర్, హాంకాంగ్ నాలుగు ప్రాంతాల్లో నాలుగు విగ్రహాలను ప్రతిష్టించారు. అంటే ఈ నాలుగు విగ్రహాల తయారీకి దాదాపు రూ. 6 కోట్లపైనే ఖర్చు చేసారు.


ప్రస్తుతానికి బాహుబలి స్టార్ ప్రభాస్ విగ్రహాన్ని బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. దాదాపు రూ. కోటిన్నర ఈ విగ్రహం తయారీకి ఖర్చు పెడుతున్నారట.


ఎందుకింత ఖర్చు?

ఈ విగ్రహం తయారీకి అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్టిస్టులు పని చేస్తారు. విగ్రహాన్ని, ప్రభాస్ ను పక్క పక్కనే పెట్టి కంపేర్ చేస్తే.... పోల్చుకోలేనంత పర్‌ఫెక్టుగా ఉంటుంది. కనురెప్పలు, జుట్టు, బాడీ కలర్, ఇలా ప్రతి అంశంలో చాలా కేర్ తీసుకుంటారు. ప్రత్యేకంగా ఆర్టిస్టులు లండన్ నుండి ఇండియాకు పలు సందర్భాల్లో ట్రావెల్ చేసి కొలతలు తీసుకోవడం లాంటివి చేస్తారు. అన్ని కలిపి ఒక విగ్రహం తయారీకి కోటిన్నర వరకు ఖర్చవుతుంది.


ఎవరు భరిస్తారు?

అయితే ఇంత ఖర్చు పెట్టి మైనపు విగ్రహాలు తయారు చేయాల్సిన అవసరం వారికి ఏమిటి? ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? అనే డౌట్ మీకు రావొచ్చు. అయితే ఈ ఖర్చులన్నీ మ్యూజియం నిర్వాహకులే భరిస్తారు. మ్యూజియం నిర్వహణ కోసం సందర్శకుల నుండి టికెట్స్ రూపంలో వసూలు డబ్బు వసూలు చేస్తారు.


ప్రముఖుల విగ్రహాలు

ప్రపంచ ప్రముఖులు, వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీల విగ్రహాలను ఈ మ్యూజియంలో ప్రతిష్టిస్తారు. ఆయా దేశాల నుండి వచ్చే సందర్శకులు ప్రపంచ ప్రముఖులతో పాటు తమ తమ దేశానికి చెందిన ప్రముఖులు విగ్రహాలను చూడటానికి ఆసక్తి చూపుతారు.


సినీ సెలబ్రిటీలు

ఇప్పటి వరకు మేడమ్ టుస్సాడ్స్‌లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ లాంటి సినీ సెలబ్రిటీల విగ్రహాలు ఉన్నాయి. సౌత్ నుండి ఈ అవకాశం దక్కించుకున్న తొలి సినీ స్టార్ ప్రభాస్ మాత్రమే.


ప్రభాస్ విగ్రహం పెట్టడంపై విమర్శలు

ప్రభాస్ కు మేడమ్ టుస్సాడ్స్ అకాశం దక్కడంతో ఆనందించిన వారి కంటే కుళ్లుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. ప్రభాస్ స్థాయి ఎంత? అతని రేంజి ఏమిటి? అతడికి మేడమ్ టుస్సాడ్స్ లో విగ్రహం ఎమిటీ అంటూ విమర్శించిన వారూ ఉన్నారు.


వ్యాపార ధోరణి...

మేడమ్ టుస్సాడ్స్ పూర్తిగా వ్యాపార ధోరణితో నడిచే మ్యూజియం. వారికి కావాల్సింది ప్రస్తుతం బాగా పాపులర్లో ఉన్న సెలబ్రిటీలే. ఆ సెలబ్రిటీల స్థాయి కూడా ఆదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ స్థాయిలో ఉండాలి. అలాంటి వారి విగ్రహాలు పెడితేనే వారికి కమర్షియల్ గా వర్కౌట్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో సినీయర్లు, పెద్ద స్టార్లు అని స్థాయి, కొలతలు చూసుకుంటే వారికి గిట్టుబాటవ్వదు.


సీనియర్లు, పెద్ద పెద్ద స్టార్లను వదిలి ప్రభాస్ విగ్రహమే ఎందుకు?

బాలీవుడ్ కి సంబంధించిన విషయమే తీసుకుంటే అమితాబ్ విగ్రహం పెట్టారు. ప్రస్తుతం అతడు పాపులారిటీలో ఉన్న స్టార్. ఆయనకంటే లెజెండరీ స్టార్లు ఉన్నా వారికి ప్రస్తుతం పాపులారిటీ లేక పోవడంతో వారి విగ్రహాలు పెట్టడానికి ఇంటస్ట్రు చూపలేదు మ్యూజియం వారు. మోడీని మించిన రాజకీయ వేత్తలు, ప్రధానులు ఉన్నా ప్రస్తుతం ఆయన వరల్డ్ సెలబ్రిటీ కాబట్టే అతని విగ్రహం పెట్టారు. ఇక బాహుబలి సినిమాతో ప్రభాస్ ఖ్యాతి దేశాంతరాలు దాటింది. త్వరలో బాహుబలి-2 మూవీ రాబోతోంది. అందుకే సినిమా విడుదల ముందు ఈ విగ్రహాన్ని అందుబాటులోకి తెస్తే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రభాస్ విగ్రహం పెట్టాలని నిర్ణయించారు.


English summary
Young Rebel Star Prabhas' wax statue would be installed by the Tussauds team. Currently a team of artists are busy carving the figure of Prabhas. It can be estimated the figure would easily costs Rs.1.5 crores.
Please Wait while comments are loading...