twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లింగా’ నష్టానికి ‘కబాలి’ ఆపడం కుదరదు: స్టే ఎత్తివేసిన మద్రాస్ హై కోర్టు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'కబాలి' సినిమా విడుదల ఆపాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. 'లింగా' వల్ల నష్టపోయిన తమకు పరిహారం చెల్లించే వరకు 'కబాలి' రిలీజ్‌ను ఆపాలని పలువురు డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించారు.

    'లింగా' వల్ల నష్టపోయిన తమకు తర్వాతి సినిమా ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఇపుడు 'కబాలి' రిలీజ్ అవుతున్నా తమకు ఎలాంటి న్యాయం చేయలేదని, తమకు పరిహారం చెల్లించే వరకు సినిమా ఆపాలని వారు కోర్టులో వాదించారు.

    అయితే 'లింగా' డిస్ట్రిబ్యూటర్లు వేసిన ఈ పిటీషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. సినిమా విడుదలను ఆపలేమని కోర్టు తేల్చి చెప్పింది. లింగా, కబాలి చిత్రాలకు నిర్మాతలు వేర్వేరు కావడంతో కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టే ఎత్తివేయడంతో 'కబాలి' సినిమాకు కోర్టు అడ్డంకులు తొలగినట్లయింది. రేపు(జులై 22)న సినిమాను రిలీజ్ చేసేందుకు గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారు.

    Madras HC rejects Lingaa distributor petition on Kabali

    రజనీకాంత్ గత సినిమా 'లింగా' సినిమాను భారీ ధరకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఆడక పోవడంతో భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరూ లక్షలు, కోట్లలో నష్టపోయారు. ఆ మధ్య ఈ విషయమై పెద్ద వివాదమే రేగింది. పంపిణీదారుల ఆందోళనతో తమిళనాడు దద్దరిల్లింది. చివరకు రజనీకాంత్ కలుగచేసుకుని కొంతమేర పరిహారం ఇప్పించారు. అయితే పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని, తమ నష్టాలు పూర్తిగా భర్తీకాలేదని వారు అసంతృప్తిగానే ఉన్నారు.

    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం 'కబాలి'కి కంటిన్యూగా కోర్టు కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితమే..టిక్కెట్ల విషయమై వేసిన పిటీషన్ సమస్య తీరిందనే సమయానికి రేపు( శుక్రవారం) విడుదల కాకుండా నిలిపివేత ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుక్ర ఫిలిమ్స్‌ పార్టనర్ ఆర్‌.మహాప్రభు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. ఆయన తన పిటీషన్ లో... గతంలో రజనీకాంత్‌ నటించిన 'లింగ' సినిమాను పంపిణీ చేసిన తమకు తీవ్రనష్టం వాటిల్లిందని, ఆ సమయంలో నష్టపరిహారం చెల్లిస్తానని ఆ చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, హీరో రజనీకాంత్‌లు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ తనకు ఇంకా రూ.89 లక్షలు చెల్లించాల్సి ఉందని, ఈ డబ్బులు చెల్లించిన తరువాతే 'కబాలి' సినిమా విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

    English summary
    Madras HC rejects Lingaa distributor petition on Kabali. Reports suggest that the petitioner has asked the Madras High Court to stay the release of Kabali till the issues with Lingaa are solved.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X