twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాబ్తా కాపీ కొట్టటం కాదు అసలు మగధీరనే కాపీ: ఇది చదివితే బుర్ర తిరిగి పోద్ది

    గతం లో అసలు మగధీర కథే నా కథకు కాపీ అంటూ ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేసిన ప్రముఖ రచయిత ఎస్పీ చారీ ఇప్పుడు మళ్ళీ తెరమీదకి వచ్చారు...

    |

    మగధీర మూవీ స్టోరీని కాపీ కొట్టేసి.. బాలీవుడ్ మూవీ 'రాబ్తా'ను తెరకెక్కించారంటూ.. గీతా ఆర్ట్స్ తరఫున కోర్టులో కేసు దాఖలు చేయడం సెన్సేషన్ అయింది. ట్రైలర్ రిలీజ్ నుంచి టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మగధీరకు కాపీ అనే అనుమానాలూ ఆరోపనలూ నడుస్తూనే ఉన్నాయి. అయితే గతం లో అసలు మగధీర కథే నా కథకు కాపీ అంటూ ఫిలిం చాంబర్ లో ఫిర్యాదు చేసిన ప్రముఖ రచయిత ఎస్పీ చారీ ఇప్పుడు మళ్ళీ తెరమీదకి వచ్చారు...

    చందేరీ ఈ కథనే కొద్ది మార్పులతో

    చందేరీ ఈ కథనే కొద్ది మార్పులతో

    1998 లో ఆంధ్ర భూమి వారపత్రికలో సీరియల్ గా వచ్చీన కథే చందేరీ ఈ కథనే కొద్ది మార్పులతో తెరకెక్కించారని ఎస్పీ చారీ ఆరోపించారు. అప్పట్లో ఆంధ్ర భూమిలో సీరియల్ గా వచ్చిన కథని చాలామందే చదివినా మగధీర సమయం లో పాపం చారీ గారికి సపోర్ట్ గా ఎవ్వరూ రాలేదు. అలా ఫిలిం చాంబర్ కూడా ఆయన ఫిర్యాదుని సీరియస్ గా పట్టించుకున్నవాళ్ళే లేరు.

    400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి

    400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి

    మధ్య ప్రదేశ్ లోని ఆర్చా రాజ్యానికి చెందిన ఇద్దరు ప్రేమికులు బావిలో దూకి ఆత్యహత్య చేసుకుంటారు. 400 ఏళ్ళ తర్వాత వీరు మళ్ళీ జన్మించి వివాహం చేసుకుంటారు. తన నవలలో ప్రేమికుల పేర్లకి హరదాల్, ఇందుమతి అని పెట్టగా సినిమాలో వాటిని మార్చి హర్ష, ఇందుగా పెట్టారని ఎస్ పి చారి వాదన.

    మిగతా అంతా సేమ్

    మిగతా అంతా సేమ్

    ఇక నవలలో విలన్ హీరోకి సోదరుడు కాగా, సినిమాలో హీరోయిన్ కి బావగా చూపించారు, ఇదీ తప్ప మిగతా అంతా సేమ్ అంటూ రచయిత ఆరోపిస్తున్నాడు. అయితే ఇది ఆరోపన కాదు నిజంగా చందేరీ నవలని చదివితే అసలు విషయం అర్థమైపోతుంది. ఎమ్మెస్కో బుక్ స్టోర్స్ లో ఈ పుస్తకం దొరకవచ్చు.

    కాంటెస్ట్ ని కూడా నిర్వహించారు

    కాంటెస్ట్ ని కూడా నిర్వహించారు

    98 లో ఈ నవల సీరియల్ గా వచ్చినప్పుడు నవల లోని ఏడు రహస్యాలని కనుగొనమంటూ ఆ పత్రిక వారు ఒక కాంటెస్ట్ ని కూడా నిర్వహించారు. అయితే ఇది కాకతాళీయం కూడా కావచ్చు అనే వాదనాలేకపోలేదు. ఇటీవల ఈ చిత్రాన్ని బాలీవుడ్ మూవీ రాబ్తా యూనిట్ కాపీ కొట్టిందని, ఈ క్రమంలో నిర్మాణ సంస్థ కోర్టు మెట్లెక్కింద‌ని వార్తలు వచ్చాయి.

    భ‌జ‌రంగి భాయీజాన్

    భ‌జ‌రంగి భాయీజాన్

    అయితే ఈ ఒక్క కథే కాదు మగధీర తర్వాత విజయేంద్ర ప్రసాద్ రాసిన బాలీవుడ్ సినిమా విషయం లో కూదా ఇలాగే జరిగింది భ‌జ‌రంగి భాయీజాన్ సినిమా క‌ధ‌కు మూలం త‌న క‌ధ అని హిందీ ర‌చ‌యిత, టివి నిర్మాత‌, ద‌ర్శకుడు అయిన మహీమ్ జోషి ఆరోపించాడు.

    కోర్టుకు ఎక్కాడు

    కోర్టుకు ఎక్కాడు

    కేవ‌లం ఆరోప‌ణ‌ల‌తోనే ఊరుకోకుండా ఆయ‌న ఈ వివాదంపై కోర్టుకు ఎక్కాడు కూడా. స‌ద‌రు క‌ధ‌ను తానెప్పుడో రాసుకున్నాన‌ని, అంతేకాకుండా దానిని 2007లో ఇండియ‌న్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో దాన్ని రిజిస్టర్ కూడా చేసుకున్నాన‌ని ఆయ‌న చెప్పాడు.

    50కోట్ల న‌ష్టప‌రిహారం

    50కోట్ల న‌ష్టప‌రిహారం

    అసోసియేష‌న్ ఆఫ్ మోష‌న్ పిక్చర్స్‌, టివి ప్రోగ్రామ్ ప్రొడ్యూస‌ర్స్ సంఘంలో కూడా న‌మోదు చేయించాన‌న్నాడు. త‌న అనుమ‌తి లేకుండా త‌న క‌ధ‌ను వాడుకున్నందుకు గాను రూ.50కోట్ల న‌ష్టప‌రిహారం ఇవ్వాల్సిందిగా ఆయ‌న డిమాండ్ చేసాడు అయితే తర్వాత మళ్ళీ ఎలాగోలా ఆయన సైలెంట్ అయిపోయాడు దాని వెనక ఏముందో ఎవ్వరికీ తెలియదు.

    న్యాయం జరుగుతుందా??

    న్యాయం జరుగుతుందా??

    అల్లు అరవింద్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని రాబ్తా విడుదల కూడా అవ్వకుండా చూస్తూంటే ఇప్పుడు చారీ ఉదంతం మళ్ళీ బయటికి వచ్చింది. మరి ఇప్పుడైనా ఎస్పీ చారీ గారికి న్యాయం జరుగుతుందా?? అంటే చూద్దాం మరి . అయినా ఈ కాపీరైట్ సమస్యలూ, కథాచౌర్యం ఆరోపణలూ ఇండస్ట్రీలో మామూలే...

    English summary
    SP Chari, the novelist who penned the novel Chanderi claims that the movie Magadheera was straight away copied from his novel that was written in 1998 and also appeared as serial in Andhra Bhoomi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X