»   » మంచు మనోజ్ దాడి కేసులో రాజీ

మంచు మనోజ్ దాడి కేసులో రాజీ

Posted by:
Subscribe to Filmibeat Telugu

తెలుగు హీరో మంచు మనోజ్, తమిళ హీరో మహత్ రాఘవేంద్ర దాడి ఎపిసోడ్ కూల్‌గా ముగిసింది. తమిళ మీడియా వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం....మోహన్ బాబు తన ఇన్‌ఫ్లూయొన్స్ ఉపయోగించి రాజీకుదిర్చాడని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య రాజీ కుదరడంతో మహత్ రాఘవేంద్ర కంప్లైంట్ కూడా వాపస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మనోజ్ చేతిలో దాడికి గురైన మహత్ రాఘవేంద్ర ప్రెస్ రిలీజ్ ద్వారా విషయాన్ని వివరించారు.

'చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్లనే తమ మధ్య గొడవ జరిగింది. మేము చాలా కాలంగా మంచి స్నేహితులం. ఇకపై మా స్నేహం కొనసాగుతుంది. నాకు సపోర్టుగా నిలిచిన మీడియా వారికి ధన్య వాదాలు' అంటూ తను ప్రెస్ నోట్లో పేర్కొన్నారు మహత్ రాఘవేంద్ర.

'తన ప్రెండ్ తో కలిసి ప్రేవేట్ గా మాట్లాడుకుంటూంటే మనోజ్ వచ్చి కొట్టడం ప్రారంభించారు. కారణమేమిటో చెప్పకుండా మనోజ్ ఆయన ముగ్గురు స్నేహితులు నన్ను కొట్టారు. నా మొహం పై , నా పొట్టపై వారు తీవ్రంగా కొట్టారు. అక్కడున్న ఎవరూ కూడా మా మధ్యకి వచ్చి నన్ను సేవ్ చేయాలని చూడలేదు. కాస్సేపటికి అందరూ పోగవగా కొట్టడం ఆపి నా చావు అతని చేతిలోనే ఉందని వార్నింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చారు. తనకు ప్రాణ రక్షణ కల్పించవల్సిందిగా మహత్ మొన్న తన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే.

హీరోయిన్ తాప్సీ కోసమే వీరి మధ్య గొడవ జరిగిందని తమిళ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఖంగుతిన్న తాప్సీ.... సినీపరిశ్రమలో అడుగుపెట్టిన నాటినుంచి మోహన్‌బాబు, లక్ష్మి, విష్ణు, మనోజ్ నాకు తెలుసు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి వారే కారణం. మోహన్‌బాబు అంకుల్ నన్ను కూతురిలా చూసుకుంటే, లక్ష్మి, విష్ణు, మనోజ్ చెల్లెలిగా ఆదరిస్తారు. అటువంటిది మనోజ్‌కి, నాకు లింకులు పెట్టడం చాలా దారుణం అంటూ తాప్సీ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం విధితమే.

English summary
Mahat Raghavendra and Manchu Manoj's controversial episode has ended in peace. Both the actors have sorted out the differences and have resolved the issue. In a press release, Mahat Raghavendra claimed, "I wish to inform all the press and friends that the misunderstanding that had happened between me and Mr Manoj Manchu has been solved amicably. Mr Manoj Manchu and we go long back in time as good friends. I am glad that the issue has been resolved and we continue to be good friends. I would like to thank the press for their extended support; it means a lot!"
Please Wait while comments are loading...