» 

లిప్ లాక్ సీన్స్ ఇరగదీసారు (ఫోటో ఫీచర్)

Posted by:

హైదరాబాద్: స్నేహగీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాలతో తనకంటూ ప్రత్చేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మధుర శ్రీధర్ తాజాగా 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ద్వారా తాప్సీ మాజీ ప్రియుడు మహత్ రాఘవేంద్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. పియా భాజ్ పాయ్, అర్చన కవి హీరోయిన్లు.

ఈచిత్రంలో హీరో ఇద్దరు హీరోయిన్లతో లిప్ లాక్ ముద్దు సీన్లు ఇరగదీసాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ చిత్ర హీరోయిన్ పియా కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతే కాదండోయ్ పాత్ర డిమాండ్ చేస్తే ఇలాంటి సీన్లు ఎలాంటి లిమిటేషన్ లేకుండా చేసేస్తానంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేంది.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రం కాలేజీ జీవితం నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రం గురించి మధుర శ్రీధర్ మాట్లాడుతూ...ఈచిత్రం కాలేజీ జీవితం తర్వాత కుర్రకారు జీవితాలను ఫోకస్ చేసే విధంగా ఉంటుందని, వినోదాత్మకంగా యూత్‌కు నచ్చే విధంగా ఉంటుందని వెల్లడించారు.

'హిస్ బ్రేకప్ + లవ్ స్టోరీ' అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రాన్ని ఎంవికె రెడ్డి నిర్మిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ జికె సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 15న ఈచిత్రం విడుదలవుతోంది. హాట్ హాట్ సీన్స్, మధుర శ్రీధర్ దర్శకత్వంలో యూత్ లో సినిమాపై అంచనాలు పెంచుతోంది.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రంలో మహత్, పియా లిప్ లాక్ సీన్.

ఈ చిత్రంలో జగడ జగడ అనే పాటను తమిళ హీరో శింబు పాడటం హైలెట్.

పియాతో పాటు అర్చన కవితో కూడా మహత్ లిప్ లాక్ సీన్లలో నటించాడు.

ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలి, శరత్ బాబు, ప్రగతి, బెనర్జీ, మధుమతి, వెన్నెల రామారావు తదితరులు నటిస్తున్నారు.

స్నేహ గీతం, ఇట్స్ మై లవ్ స్టోరీ చిత్రాల దర్శకుడు మధుర శ్రీధర్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రం యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ నెల 15న ఈచిత్రం విడుదలవుతోంది.

Read more about: mahat raghavendra, piaa bajpai, archana kavi, back bench student, మహత్ రాఘవేంద్ర, పియా భాజ్‌పాయ్, అర్చన కవి, బ్యాక్ బెంచ్ స్టూడెంట్
English summary
Mahat Raghavendra's lip lock scene in the movie Back Bench Student is no longer a secret affair as its pictures have already graced the internet. The actor has a couple of kissing and smooching scenes with actress Pia Bajpai and Archana Kavi. Pia has recently confirmed this news. She says that she has no limitations and she will do whatever a script and her character demand from her.

Telugu Photos

Go to : More Photos