twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    25 లక్షలు విరాళం ప్రకటించిన మహేష్ బాబు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హుధూద్ తుఫాన్ బాధితుల కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు. సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని అభిమానులకు పిలుపు ఇచ్చారు. హుధూద్ తుఫాన్ ఊహించని నష్టాన్ని కలిగించిందని, ప్రభావిత ప్రాంతాలు త్వరగా పునర్ వైభవాన్ని సంతరించుకోవాలని మహేష్ బాబు ఆకాంక్షించారు.

    ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం టాలీవుడ్ హీరోలైన పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. మరో వైపు జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చెరొక 20 లక్షల చొప్పున విరాళం అందించారు. మరో వైపు రామ్ చరణ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షలు, విశాఖలోని రామకృష్ణ మిషన్ కోసం రూ. 5 లక్షలు విరాళం అందించారు.

    Mahesh Babu announces 25 lakhs to Hudhud victims

    శాటిలైట్ సిస్టం హెచ్చరికలతో హుధూద్ తుఫాన్ గురించి ముందే తెలియడంతో అంతా ముందుగానే అప్రమత్తం అయ్యారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంగో పెనుగాలులు వీయడంతో ఆస్తి నష్టం భారీగా ఏర్పడింది.

    ఈ రోజు ప్రధాన మంత్రి మోడీ విశాఖలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం తరుపున తక్షణ సహాయం కింద రూ. 1000 కోట్ల సహాయం ప్రకటించారు. హుధూద్ తుఫాన్ బాధితుల కోసం సినీ తారలతో పాటు, తెలుగు వారంతా తమ వంతు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

    English summary
    Tollywood heroes are showing their philanthropic side now. It is well-known that Ram Charan, Allu Arjun and Pawan Kalyan have donated 15 lakhs, 20 lakhs and 50 lakhs respectively to Hudhud relief.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X