»   » వాళ్లకి కావాల్సింది ప్రేమ : మహేష్ బాబు ట్వీట్

వాళ్లకి కావాల్సింది ప్రేమ : మహేష్ బాబు ట్వీట్

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్ బాబుకు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన ఇద్దరు పిల్లలు గౌతమ్, సితారల విషయంలో ఆయన తీసుకునే కేర్ గురించి, వాళ్ల సంతోషం గురించి మహేష్ బాబు చేసే పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్... తల్లిదండ్రులు అలానే ఉంటారనుకోండి, కానీ తండ్రిగా మహేష్ బాబు పిల్లల కోసం టైమ్ కేటాయించినంతగా టాలీవుడ్లో ఇతర స్టార్లు ఎవరూ కేటాయించలేరేమో?

కాగా.. బాలల దినోత్సవం సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసారు. పిల్లలకు కావాల్సిందల్లా ప్రేమ.. రెక్కలు. అప్పుడే వారు మరింతగా ప్రేమించడం, స్వేచ్ఛగా విహరించడం చూడగలుగుతాం.. అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను ట్వీట్ చేసారు. ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న ఎ.ఆర్‌. మురుగదాస్‌ మూవీకి సంబంధించిన ఫోటోలే అవి.

భాష్యం స్కూలు పిల్లలు

మహేష్ బాబు - మురగదాస్ మూవీ కోసం భాష్యం స్కూల్‌కి చెందిన 2,500 మంది విద్యార్థులతో చిత్రీకరణ జరిపినట్లు సమాచారం. వీరికి మహేష్ బాబు దీపావళి కానుకగా గిఫ్ట్‌ బాక్సులను కూడా పంపారు.

కాన్సెప్ట్

ఈ సినిమాలో ఓ బలమైన సామాజిక అంశాన్ని ప్రముఖంగా ఫోకస్ చేయబోతున్నారు. మహేష్ బాబు సరసన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారిస్‌ జయరాజ్‌ సంగీతం అందిస్తున్నారు.

మహేష్‌తో సెల్ఫీ, పవన్ కళ్యాణ్ సహా...ఇండస్ట్రీ మొత్తం దిగింది (ఫోటోస్)

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో ఈ నెల 6న గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.... ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

మహేష్ కొత్త మూవీ స్టిల్స్ మళ్ళీ లీకయ్యాయి...(ఫొటోలు)

మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్లో దాదాపు 70-80 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళం లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

సూపర్ డెసిషన్ : సీటు రిజర్వ్ చేసుకునే మహేష్ సీన్ లోకి...

సినిమా ప్రారంభానికి ముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం ఈ మధ్యకాలంలో కామన్ గా మారింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లలకు,ట్రేడ్ వర్గాలకు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

టాలీవుడ్ 2016 హిట్స్ అండ్ ప్లాప్స్.... (లిస్ట్)

2016 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 140 వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

మహేష్ డుమ్మా: శ్రీమంతుడు మించేలా కొరటాలతో మరో మూవీ షురూ (ఫోటోస్)

హైదరాబాద్: 'శ్రీమంతుడు' వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో ప్రెస్టీజియస్‌... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
"All they need is love to make them love more and wings to see them fly :) #HappyChildrensDay" Mahesh Babu tweeted,
Please Wait while comments are loading...