»   » మహేష్ బాబు పరువు తీద్దామనుకున్నారు, కానీ...!

మహేష్ బాబు పరువు తీద్దామనుకున్నారు, కానీ...!

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. బాహుబలి తర్వాత భారీ వసూళ్లు సాధించిన సినిమా కూడా. 'శ్రీమంతుడు' మూవీ ఇంత పెద్ద హిట్ కావడానికి ప్రధాన కారణం సినిమాలోని చూపుట్టిన గ్రామాల దత్తత అనే ఒక మంచి కాన్సెప్టే.

ఈ సినిమా తర్వాత చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యారు. అనేక మంది సామాన్య జనం, సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవాలని, తమ ఊరి కోసం ఏదైనా చేయాలనే ఆలోచనకు వచ్చారు. ఈ మధ్య కాలంలో ఒక సినిమా జనాల్లో ఇంత మార్పు తేవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మహేష్ బాబు అన్నయ్య కొడుకు ధోతి ఫంక్షన్ (ఫోటోస్)

మహేష్ బాబు కూడా గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే సినిమా రిలీజై వందరోజులు పూర్తయినా మహేష్ బాబు బుర్రిపాలెం విలేజ్ ఇంకా ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చెట్టలేదు. దీంతో సినిమా పబ్లిసిటీ కోసమే మహేష్ బాబు ఆ ప్రకటన చేసారనే ఆరోపణలు కూడా చేసారు కొందరు యాంటీ ఫ్యాన్స్!

ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలను వేదికగా చేసుకుని అప్పట్లో కొందరు మహేష్ బాబు ఫోటోలను మార్పింగ్ చేసి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. అదే బ్యాచ్ కి చెందిన కొందరు.... బుర్రిపాలెం విషయంలో మహేష్ బాబు ఆలస్యం చేస్తున్న విషయాన్ని హైలెట్ చేసి సోషల్ మీడియా ద్వారా పరువు తీసేందుకు ప్లాన్ చేసారు.

అయితే వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా మహేష్ బాబు....చకచకా కార్యాచరణ మొదలు పెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేష్ బాబు తన దత్తత గ్రామమైన బుర్రిపాలెం అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల గురించి తెలుసుకునేందుకు తన భార్య నమ్రత, సోదరి పద్మావతిలను సభ్యులను పంపి వారి ద్వారా వివరాలు తెలుసుకోనున్నారు. న్రమతతో పాటు మహేష్ బాబు కుమారుడు గౌతం, కూతురు సితార కూడా వస్తారని సమాచారం. ఇప్పటికే గ్రామంలో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారుల ద్వారా మహేష్ బాబు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడంతో పాటు ఎల్‌ఈడీ వీధి లైట్ల ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నారు. వీటిపై గ్రామస్తులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

రేపు(మార్చి 17, గురువారం)మొత్తం బుర్రిపాలెం గ్రామంలో నమ్రత, పద్మావతి తదితరులు గడపనున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బుర్రిపాలెంకు రానున్న మహేష్ కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 3.30 గంటల వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. అనంతరం బుర్రిపాలెం గ్రామంలో పర్యటించి గ్రామస్తులతో మమేకమై వారి అవసరాలు తెలుసుకుంటారు. గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌, పిహెచ్‌సీలను కూడా సందర్శిస్తారని ఎంపీ జయదేవ్‌ కార్యాలయ ప్రతినిధి మంగళవారం తెలిపారు.

స్లైడ్ షోలో మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన క్యూట్ ఫోటోస్...

ఫోటోస్

మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన క్యూట్ ఫోటోస్

English summary
Namrata Mahesh and his sister Padmavathi will be visiting Burripalem and will be spending the whole 17th day of May there. They will be helding a meeting with local officials and look into the development activities in person.
Please Wait while comments are loading...