»   » మహేష్-మురుగదాస్ మూవీ సంచలనం: జీటీవీతో 26 కోట్ల డీల్?

మహేష్-మురుగదాస్ మూవీ సంచలనం: జీటీవీతో 26 కోట్ల డీల్?

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంబంధించి మీడియా, అభిమానుల సర్కిల్ లో ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ సాగుతూ ఉంటుంది. ఈ సినిమాకు ఇంకా అఫీషియల్ టైటిల్ ఖరారు కానప్పటికీ రకరకాల టైటిల్ ఇప్పటి వరకు ప్రచారంలోకి వచ్చాయి.

ఈ మూవీకి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. తాజాగా 'ఏజెంట్ శివ' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. 'ఏజెంట్ శివ' ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

తెలుగు, త‌మిళ్ లో 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన యాక్ష‌న్ సీన్స్ ను ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో చిత్రీక‌రిస్తున్నారు.

 జీటీవీతో రూ. 26 కోట్ల డీల్

జీటీవీతో రూ. 26 కోట్ల డీల్

ఈ సినిమాకు సంబంధించి జీటీవీ వారు భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ 26 కోట్ల రూపాయలనే ప్రచారం జరుగుతోది. ఇందులో 21 కోట్లు తెలుగు, తమిళం శాటిలైట్ రైట్స్ కు కాగా ఐదు కోట్లు ఈ సినిమా హిందీ డబ్బింగ్ డబ్బింగ్ రైట్స్ కింద తీసుకున్నట్లు టాక్.

వర్చువల్ రియాల్టీలో టీజర్

వర్చువల్ రియాల్టీలో టీజర్

ఈ మధ్య తెలుగులో సినిమా మేకింగ్ వీడియోలను, టీజర్లను వర్చువల్ రిలీజ్ చేసే ట్రెండ్ మొదలైంది. మహేష్-మురగదాస్ కాంబినేషన్ మూవీ టీజర్ కూడా ఈ వర్చ్యువల్ రియాల్టీ టెక్నాలజీ లో విడుదల చేయడానికి వర్క్ స్టార్ట్ అయింది.

 10 సెకండ్ల టీజర్ కోసం భారీ...

10 సెకండ్ల టీజర్ కోసం భారీ...

టైటిల్ ఖరారు చేస్తూ పది సెకెండ్ల టీజర్ రిలీజ్ చేస్తారట. లాస్ ఏంజిల్స్ లోని ఓ కంపెనీ దీన్ని తయారుచేస్తుందని అంటున్నారు. ఈ టీజర్ కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారట.

మురుగదాస్ మూవీ.... మహేష్ బాబు లుక్ ఇదే!

మురుగదాస్ మూవీ.... మహేష్ బాబు లుక్ ఇదే!

తాజాగా సెట్స్ లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటో ఒకటి సంతోష్ శివన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయగా... మహేష్ బాబు కూడా దాన్ని తన ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు షేర్ చేసారు. ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ బయటకు రావడం ఇదే తొలిసారి.

 పూరి సంచలన కామెంట్: చిరంజీవి, మహేష్ బాబులను ఉద్దేశించేనా?

పూరి సంచలన కామెంట్: చిరంజీవి, మహేష్ బాబులను ఉద్దేశించేనా?

పూరి సంచలన కామెంట్: చిరంజీవి, మహేష్ బాబులను ఉద్దేశించేనా?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Superstar Mahesh Babu's latest movie under the director of AR Murugadoss is luring people from a long time about the possible title. Film Nagar source said that Mahesh Babu and Murugadoss Title Agent Siva.
Please Wait while comments are loading...