twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే నిర్మాతగా, దర్శకత్వం నో..(మహేష్ బాబు ఇంటర్వ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీమంతుడు'. ఆగస్టు 7న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే... ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన ప్రముఖ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయారు.

    తాజాగా ఓ ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూ ఇచ్చిన మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాను నిర్మాతగా మారడానికి కారణాలు కూడా వెల్లడించారు. సినిమా నిర్మాణం అనేది ఒక ఛాలెంజింగ్. పనిని ఎగ్జిక్యూట్ చేయడం రియల్ ట్యాలెంటును వెతికి పట్టుకుని తెరపైకి తీసుకురావడం సవాల్ తో కూడుకున్నది అని తెలిపారు.

    ‘శ్రీమంతుడు' సినిమాకు కో ప్రొడ్యూసర్ గా మరాడానికి కారణం....సినిమా మేకింగ్ లో ప్రొడక్షన్ లో ఏం జరుగుతోందో పూర్తిగా పరిశీలించాలనే కారణంతోనే. దానివల్ల సినిమా నిర్మాణంపై వస్తుంది. పూర్తి స్థాయి నిర్మాతగా మారడానికి ఆ అనుభవం ఉపయోగ పడుతుంది. ఇప్పటికిప్పుడు పెద్ద నిర్మాత అయిపోవాలని కలలుగనడం లేదు. సొంతంగా స్టూడియోలు కట్టాలన్న ఆలోచన కూడా ఇపుడు లేదన్నారు మహేస్ బాబు.

    స్లైడ్ షోలో మహేష్ బాబు చెప్పిన మరిన్ని విశేషాలు..

    దర్శకత్వం గురించి...

    దర్శకత్వం గురించి...

    దర్శకత్వం అనేది చాలా కిష్టమైన జాబ్. దానికి చాలా స్కిల్స్ కావాలి. నటుడిగా ఉండటమే నాకు కంఫర్టుగా ఉంది. దర్శకత్వం ఆలోచన లేదు. భవిష్యత్తులో కూడా అటు వైపు వెళ్లక పోవచ్చన్నారు మహేష్ బాబు.

    తను ఎంచుకునే కథల గురించి..

    తను ఎంచుకునే కథల గురించి..

    సినిమా ఒప్పుకోవాలా వద్దా అనే విషయంలో పూర్తి నిర్ణయం నాదే. డైరెక్టర్ కథ చెప్పినపుడు నచ్చితే వెంటనే ఓకే చెబుతాను. నా నిర్ణయాలన్నీ స్క్రిప్టును బట్టే ఉంటాయి. సినిమా కమిట్ అయ్యాక పాత్రకు తగిన విధంగా పెర్పార్మెన్స్ ఎలా ఇవ్వాలనే దానిపై దృష్టి పెడతాను. మిగతా విషయాల్లో వేలు పెట్టను. అయితే సెట్స్ కెళ్లముందే అన్ని సందేహాల్ని తీర్చేసుకుంటాను అన్నారు మహేష్ బాబు.

    సాధారణ జీవితమే

    సాధారణ జీవితమే

    నాన్నగారు స్టార్ అనే విషయాన్ని పక్కనపెట్టి సాధారణ జీవితాన్ని గడపడానికే ప్రాధాన్యమిచ్చేవారు. నాకు అదే అలవాటయింది. నేను స్కూలుకు ఆటోలో వెళ్లేవాడిని. ఇపుడు గౌతంకు కూడా అలా ఉండటం నేర్పిస్తున్నాం. అది కాస్త కష్టమే. గౌతంకు సంబంధించిన అన్ని విషయాలు నమ్రతనే చూసుకుంటోంది.

    భార్య, పిల్లలతో గడపడమే...

    భార్య, పిల్లలతో గడపడమే...

    సినిమాల మధ్యలో గ్యాప్ వస్తే హాలిడేయింగ్ చేయడానికి ఇష్టపడతాను. భార్య పిల్లలతో గడపడమే నాకు రీఫ్రెష్ మెంట్.

    తమిళ సినిమా గురించి...

    తమిళ సినిమా గురించి...

    నేను తమిళ,తెలుగు భాషల్లో బైలింగ్వుల్ చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాను. మురగదాస్ చేసే అవకాసం ఉంది.

    English summary
    Mahesh said that he has never thought about getting into direction since its a very difficult job and that it requires a different set of skills.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X