twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముఖ్యమంత్రిగా ప్రిన్స్ మహేశ్.. బాలకృష్ణతో పోటీకి రెడీ..

    ప్రిన్స్ మహేశ్ బాబు ఓ వైపు స్పైడర్ చిత్రంలో నటిస్తూనే మరోపక్క దర్శకుడు కొరటాల శివ చిత్రంలో నటంచేందుకు సిద్దమవుతున్నాడు.

    By Rajababu
    |

    ప్రిన్స్ మహేశ్ బాబు ఓ వైపు స్పైడర్ చిత్రంలో నటిస్తూనే మరోపక్క దర్శకుడు కొరటాల శివ చిత్రంలో నటంచేందుకు సిద్దమవుతున్నాడు. కొరటాల దర్శకత్వం వహించే భరత్ అనే నేను చిత్రంలో సెన్సేషనల్ పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరి కలయికలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో భరత్ అనే నేను చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ముఖ్యమంత్రి పాత్రలో ప్రిన్స్ మహేశ్

    ముఖ్యమంత్రి పాత్రలో ప్రిన్స్ మహేశ్

    స్పైడర్ చిత్రానికి సంబంధించిన వరకు మహేశ్ నటించే భాగానికి చెందిన షూటింగ్ పూర్తయిందట. ఇటీవలనే భరత్ అనే నేను చిత్రం యూనిట్‌తో మహేశ్‌బాబు జత కలిసినట్టు తెలిసింది. ఈ చిత్రంలో మహేశ్ బాబు ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నట్టు తెలిసింది.

    రాజకీయ నేతగా దూకుడు

    రాజకీయ నేతగా దూకుడు

    రాజకీయ నేతగా, ఎమ్మెల్యే పాత్రలో మహేశ్ దూకుడు చిత్రంలో కనిపించారు. అయితే పూర్తిస్థాయి రాజకీయ నేతగా మాత్రం నటించలేదు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మహేశ్ క్యారెక్టర్‌ను దర్శకుడు కొరటాల పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దినట్టు సమాచారం.

    మహేశ్ సరసన పూజా హెగ్డే, కైరా దత్

    మహేశ్ సరసన పూజా హెగ్డే, కైరా దత్

    ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్ల ఎంపిక కూడా పూర్తయినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రంలో దువ్వాడ జగన్నాథంతో ఆకట్టుకొంటున్న పూజా హెగ్డే నటిస్తున్నట్టు సమాచారం. ఇందులో బాలీవుడ్ నటి కైరా అద్వానీ మరో హీరోయిన్‌గా నటిస్తున్నది.

    ఆసక్తికరంగా ప్రిన్స్ మహేశ్ పాత్ర

    ఆసక్తికరంగా ప్రిన్స్ మహేశ్ పాత్ర

    భరత్ అనే నేను సినిమా కోసం అసెంబ్లీకి సంబంధించిన సెట్‌ను భారీ స్ఠాయిలో నిర్మించినట్టు తెలుస్తున్నది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయ నేతగా మహేశ్ ఎలా కనిపించనున్నాడు. ఆ పాత్ర స్వరూపం, స్వభావం ఎలా ఉంటుంది. కొత్త అవతారం ప్రిన్స్ చెప్పే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనే అంశాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

    హాలీవుడ్ స్థాయిలో స్పైడర్ చిత్రం

    హాలీవుడ్ స్థాయిలో స్పైడర్ చిత్రం

    ఈ సినిమాకు ముందు వచ్చే స్పైడర్ చిత్రం కూడా మహేశ్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందనే మాట వినిపిస్తున్నది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

    బాలయ్యతో

    బాలయ్యతో

    హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చ ిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 29న విడుదల కానున్నదనే తాజా సమాచారం. ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ పైసా వసూల్ చిత్రం, శివకార్తీకేయన్ సినిమా వేలైక్కరన్ ‌తో పోటీ పడనున్నది. పైసా వసూల్, వేలైక్కరన్ చిత్రాల పోటీని ఏ విధంగా తట్టుకొంటుందనే అంశం చర్చనీయాంశమైంది.

    English summary
    Mahesh Babu will play the role of a Chief Minister. Now that’s an avatar we haven’t seen the Telugu superstar in before! Surely it will be a character to look forward to. There were rumours that Pooja Hegde was approached for this film. But other reports state that Kiara Advani might star opposite the Telugu actor. The film is reportedly called -Bharath Ane Nenu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X