twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికా వెళ్లి ప్రమోట్ చేయనున్న మహేష్ బాబు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు'(తాత్కాలిక టైటిల్) చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జులై 17 నాటికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ చిత్రాన్ని అమెరికా వెళ్లి ప్రమోట్ చేయనున్నారట.

    జులైలో అమెరికాలో జరిగే ప్రీమియర్ షోకి మహేష్ హాజరవుతున్నట్లు ఇన్ సైడ్ టాక్. అదే సమయంలో ‘తానా'(తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సెలబ్రేషన్స్ కూడా ఉండటంతో మహేష్ బాబు ఈ వేడుకలకు కూడా హాజరవుతారని సమాచారం.

    కాగా ఈ సినిమా బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని అమ్మారని అదీ రికార్డు రేటుకు అని చెప్తున్నారు. క్లాసిక్ ఎంటర్నైమెంట్ వారు..ఈ రైట్స్ ని 8.1 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు ఈ రేటు రాలేదు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది, మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలే ఎక్కువ రేట్ తో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాయి. ఇప్పుడు తన రికార్డుని తనే మహేష్ బ్రద్దలు కొట్టుకున్నారు.

    Mahesh Babu to promote his next in US

    ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలియనీర్(ధనవంతుడు)గా కనిపించబోతున్నాడు. ఇందులో అతని లుక్, స్టైల్ పూర్తిగా డిఫరెంటుగా కనిపించబోతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఉగాదికి ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తోంది. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

    ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నీ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

    English summary
    n the outskirts of Hyderabad, is likely to attend the US premiere of the film in July. A source says, “The actor enjoys a great fan base across US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X