twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనే ఎప్పూడూ ఊహించని రోజు ఇది: మహేష్ బాబు (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూప‌ర్‌స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘శ్రీ శ్రీ' చిత్రం ఆడియో వేడుక గురువారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై సీడీలు విడుదల చేసారు. ఎస్‌.బి.ఎస్‌.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణతో పాటు విజ‌య‌నిర్మల, న‌రేష్‌, సుధీర్ బాబు ప్ర‌ధాన పాత్రలు పోషించారు. ఇ.య‌స్‌.మూర్తి సంగీతం అందించారు.

    ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ....నాన్న గారికి ఉన్న అతిపెద్ద ఫ్యాన్ నేనే. నాలుగైదు నెల‌లు క్రితం నాన్న‌గారి గెట‌ప్‌ను పేప‌ర్‌ చూసి అభిమానిగా ఎగ్జైట్ అయ్యాను. ట్రైల‌ర్ చూడ‌గానే సినిమా చూడాలనే అతృత మొద‌లైంది. ఎప్పుడూ నాన్న‌గారు నా సినిమాల‌కు అతిథిగా వ‌స్తుంటారు. నేను ఇవాళ నాన్న‌గారి సినిమాకు రావ‌డం ఆనందంగా ఉంది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. సినిమా టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అన్నారు.

    Also Read: ఊహకు అందని విధంగా... సూపర్ స్టార్ కృష్ణ

    కృష్ణ మాట్లాడుతూ...న‌టుడుగా 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్న నేప‌థ్యంలో ఈ వేదిక‌పై న‌న్ను స‌త్క‌రించినందుకు నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఈ సంద‌ర్భంగా నేను కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిన వ్య‌క్తులు ఇద్ద‌రూ వారిలో ఒక‌రు తేనెమ‌న‌సులు సినిమాతో న‌న్ను హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేసిన ఆదూర్తి సుబ్బారావుగారు ఒక‌రైతే, గూఢ‌చారి 116తో మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన డూండీగారు మరొక‌రు. ఇప్పుడు న‌టుడుగా 50 వ‌సంతాలు పూర్తి చేసుకునే బ‌లాన్ని గూఢ‌చారి 116 సినిమా ఇచ్చింది. ఆరేడు సంవ‌త్స‌రాలుగా నేను మంచి క్యారెక్ట‌ర్ చేయ‌లేదు. శివ మ‌రాఠీ సినిమాను చూప‌గానే సినిమా బాగా న‌చ్చింది. ముప్ప‌ల‌నేని శివ మ‌రాఠీ సినిమా కంటే వంద‌రెట్లు బాగా డైరెక్ట్ చేశాడు. నా సినీ కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్ మూవీ అవుతుంది అన్నారు.

    స్లైడ్ షోలో ఫోటోస్, మరిన్ని వివరాలు....

    48వ సినిమా..

    48వ సినిమా..

    కృష్ణ సతీమణి విజయనిర్మల మాట్లాడుతూ...దర్శకుడు శివ బాగా తీసారు, ఇద్దరం ఎంతో హ్యాపీగా చేసాం. నేను, ఆయ‌న క‌లిసి న‌టించిన 48వ సినిమా ఇది. మ‌రో రెండు సినిమాలు చేస్తే 50 సినిమాలు పూర్త‌వుతాయి అన్నారు.

    దర్శకుడు...

    దర్శకుడు...

    ముప్పలనేని శివ సినిమా గురించి మాట్లాడుతూ...ఎదురుగా అన్యాయం జ‌రుగుతున్న‌ప్పుడు గుండె మండి ప్ర‌తివాడు శ్రీ శ్రీయే. నిర్మాత‌లు ఎంతో స‌పోర్ట్ చేశారు. కృష్ణ‌గారి గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చే మూవీ అవుతుంది`` అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ..

    నిర్మాత మాట్లాడుతూ..

    ముప్ప‌ల‌నేని శివ మా ఫ్యామిలీ ఫ్రెండ్‌. మా బ్యాన‌ర్ నుండి ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో శివ‌గారు న‌న్ను క‌లిసి శ్రీ శ్రీ గురించి చెప్పారు. ఇలాంటి సినిమా కోస‌మే మేం వెయిట్ చేస్తున్నామ‌నుకుని స‌రేన‌న్నాం. ఈ సినిమాలో కృష్ణ‌గారి యాక్టింగ్ అద్భుతం. ఈ సినిమాలో మ్యూజిక్ బాగా వ‌చ్చింది. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంది`` అన్నారు.

    సుధీర్ బాబు

    సుధీర్ బాబు

    కృష్ణగారు లేకపోతే నేను ఎక్కడ వుండేవాడ్నో తెలియదు. ఆయన వల్లే నేను ఇండస్ట్రీ వైపు వచ్చాను. కృష్ణగారి సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌ అవకాశం వచ్చినా చేయడానికి నేను రెడీ. ఈ సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో నటించాను. ఎన్ని సినిమాల్లో యాక్ట్‌ చేసినా కూడా నాకు ఇంత శాటిస్‌ఫ్యాక్షన్‌ దొరకదు. మా అబ్బాయి దర్శన్‌ ఈ సినిమాతో లాంచ్‌ అవడం చాలా సంతోషంగా వుంది అన్నారు.

    సీడీ ఆవిష్కరణ

    సీడీ ఆవిష్కరణ

    స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై సీడీలు విడుదల చేసారు.

    నిర్మాణం

    నిర్మాణం


    ఎస్‌.బి.ఎస్‌.ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ముప్ప‌ల‌నేని శివ ద‌ర్శ‌క‌త్వంలో చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్ నిర్మిస్తున్న

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    ఎప్పుడూ నాన్న‌గారు నా సినిమాల‌కు అతిథిగా వ‌స్తుంటారు. నేను ఇవాళ నాన్న‌గారి సినిమాకు రావ‌డం ఆనందంగా ఉంది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు అన్నారు.

    శివ గురించి...

    శివ గురించి...

    ముప్ప‌ల‌నేని శివ మ‌రాఠీ సినిమా కంటే వంద‌రెట్లు బాగా డైరెక్ట్ చేశాడు. నా సినీ కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్ మూవీ అవుతుంది అన్నారు కృష్ణ.

    తారాగణం

    తారాగణం

    సాయికుమార్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ముర‌ళీ శ‌ర్మ‌, ఎల్‌.బి.శ్రీరాం, తోట‌ప‌ల్లి మ‌ధు, కాదంబ‌రి కిర‌ణ్‌, పృథ్వీ, దేవ‌దాస్ క‌న‌కాల‌, కునాల్ కౌశిక్‌, అన‌గాన రాయ్‌, సోఫియా, ఆశిష్ గాంధీ త‌దిత‌రులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.

    తెర వెనక

    తెర వెనక

    ఈ చిత్రానికి స్టోరీః ర‌మేష్ డియో ప్రొడ‌క్షన్స్‌, డైలాగ్స్ః రాం కంకిపాటి, మ్యూజిక్ః ఇ.య‌స్‌.మూర్తి, ఎడిట‌ర్ః ర‌మేష్ కొల్లూరి, సినిమాటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, ఆర్ట్ః అశోక్‌, స్క్రిప్ట్ః క‌ళ్యాణ్ జీ గోగ‌నా, ఫైట్స్ః నందు, నిర్మాత‌లుః చాట్ల సాయిదీప్‌, బాలు రెడ్డి.వై, షేక్ సిరాజ్, ద‌ర్శ‌క‌త్వం: ముప్ప‌ల‌నేని శివ‌.

    దర్శన్

    దర్శన్

    సుధీర్ బాబు తనయుడు దర్శన్ శ్రీ శ్రీ చిత్రం ద్వారా తెరంగ్రేటం చేస్తున్నారు.

    అందరూ స్టార్స్

    అందరూ స్టార్స్

    ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అంతా హాజరు కావడంతో వేడుక మరింత సందడిగా సాగింది.

    English summary
    Mahesh Babu launched the audio of Superstar Krishna's come back film, Sri Sri, yesterday, at Shilpakala Vedika, Hyderabad. The event witnessed a perfect Kodak moment with Krishna, Mahesh and his son Gautham at one place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X