Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రెమ్యూనరేషన్లో మహేష్ బాబు మరో రికార్డ్
హైదరాబాద్ : మహేష్, మురగదాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు సంభంధించిన కథ ఫైనలైజ్ చేసి ఇప్పుడు కాస్టింగ్ మొదలు పెట్టారు. హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనలైజ్ చేసారు. అలాగే...ఏప్రిల్ రెండవ వారం 2016 నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని సమచారం.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మహేష్ బాబు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అని టాక్. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదలవుతున్న నేపథ్యంలో ఇంత భారీ మొత్తం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఇద్దరు టాప్ ప్రొడ్యూసర్స్ ఈ ప్రాజెక్టుని సెట్ చేసారని సమాచారం. మహేష్ బాబుకు నిర్మాత ఎన్.వి ప్రసాద్ తో చిత్రం కమిట్ మెంట్ ఉంది. అలాగే మురుగదాస్ కు ఠాగూర్ మధు తో సినిమా చెయ్యాలని ఎగ్రిమెంట్ ఉంది. ఈ రెండూ కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసారని తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు 80 నుండి 100 కోట్ల వరకు కోట్లు ఖర్చుపెట్టడానికి వీరు సిద్దమైనట్లు సమచారం.
ఇది మహేష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం. విజువల్ గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో ప్రయారిటీ లేదు కానీ భారీగా, రిచ్ గా ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో ఈ సినిమా తీయాలని మురుగదాస్ నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారు. మరి మురగదాస్ ఈ ప్రాజెక్టుతో ఏం సంచనలం సృష్టించనున్నారో చూడాలి.