twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పైడర్ హంగామా అంతా ఇక్కడేనా..? అక్కడ కనీస రెస్పాన్స్ కూడా లేదు

    మురుగదాస్‌కి బాలీవుడ్‌లో మంచి పేరు వుండడంతో 'స్పైడర్' చిత్రానికి నార్త్‌లో స్పైడర్ కి కూడా మార్కెట్‌ వుంటుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది,

    |

    టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' తాజా సినిమా 'స్పైడర్' కోసం చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. టీజర్ ఎప్పుడు విడుదలవుతుందా ? అని ఉత్కంఠగా ఎదురు చూసిన అభిమానులకు సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక్కరోజులోనే స్పైడర్ సంచలనం అయ్యింది. ఈ టీజర్ కు కేవలం 24 గంటల్లోనే 6.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఒక సినిమా టీజర్ కు కేవలం ఒక రోజుల్లో 60లక్షల 30వేల వ్యూస్ రావడం ఓ రికార్డు. అయితే ఇంత సంచలనం రేపిన స్పైడర్ హిందీలో మాత్రం అంతంత మారంగానే ఉన్నాడు...

    రెస్పాన్సే లేకపోవటం

    రెస్పాన్సే లేకపోవటం

    దర్శకుడు మురుగదాస్‌కి బాలీవుడ్‌లో మంచి పేరు వుండడంతో ఈ చిత్రానికి నార్త్‌లో స్పైడర్ కి కూడా మార్కెట్‌ వుంటుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది, అదీ మామూలుగా కాదు అసలు మరీ అనుకున్నదానికంటే తక్కువ ఉండటం కాదు అసలు రెస్పాన్సే లేకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

    బాహుబలి తప్ప

    బాహుబలి తప్ప

    ప్రస్తుతానికి నార్త్‌ బయ్యర్ల నుంచి ఈ చిత్రం కోసం ఎలాంటి ఎంక్వయిరీలు రావడం లేదట. క్రేజీ సినిమా బాహుబలి తప్ప సౌత్ సినిమాలు బాలీవుడ్ లో పెద్దగా అడవు, రీమేక్ చేసి బాలీవుడ్ హీరోలు చేస్తే ఓకే గానీ మన హీరోలు వాళ్ళకి నచ్చరు మరి. సౌత్ ఇండియన్ సిన్మాల రీమేక్ లే అయినా గజినీ, కిక్ లాంటి సినిమాలు ఎంత భారీ హిట్ లో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా.

    రణ్‌ జోహార్‌లాంటి సపోర్ట్‌

    రణ్‌ జోహార్‌లాంటి సపోర్ట్‌

    మామూలు బడ్జెట్ లని దాటి దాదాపుగా బాహుబలి ఫస్ట్ పార్ట్ అంత భారీగా ఖర్చు పెట్టిన ఈ చిత్రానికి బాహుబలికి దొరికినట్టు కరణ్‌ జోహార్‌లాంటి సపోర్ట్‌ దొరకట్లేదు. కానీ ప్రభాస్‌ చిత్రం సాహో విషయం లో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు ఈచిత్రం ఇంకా సెట్స్‌ మీదకి వెళ్లకుండానే హిందీ వెర్షన్‌ రైట్స్‌ కోసం పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయి.

    మహేష్‌ 'స్పైడర్‌'కి రావడం లేదు

    మహేష్‌ 'స్పైడర్‌'కి రావడం లేదు

    బాహుబలితో ప్రభాస్‌కి అక్కడ వచ్చిన గుర్తింపు సాహోకి ఖచ్చితంగా కలిసి వస్తుందనీ.., ఎంత తక్కువలో పోయినా తమకు ఎంతో కొంత మిగులుతుందనీ అంటున్నారు బయ్యర్లు. అదే క్రేజ్‌ మహేష్‌ 'స్పైడర్‌'కి రావడం లేదు. దానికోసమే ప్రస్తుతం ఒక స్పెషల్‌ పీఆర్‌ టీమ్‌ని హైర్‌ చేయాలని ప్లాన్‌ చేసుకుంటున్నారట.

    English summary
    After his message on Twiter about SPYder, speculations are high that Karan Johar might come on-board for the Hindi version of SPYder.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X