twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీమంతుడు' కథ నాదే: పెద్దలు న్యాయం చేయటం లేదు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఈ మధ్య కాలంలో కాపీ వివాదాలు బాగా ఎక్కువయ్యాయి. సినిమా రిలీజ్ అయ్యాక ..తమ కథనే కాపీ కొట్టి తీసారంటూ ఆధారాలతో ఫిల్మ్ ఛాంబర్ ని, రైటర్స్ అశోశియేషన్ ని సంప్రదించేవారు అధికమయ్యారు. ఇప్పుడు అలాంటి వివాదమే మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడుకు ఎదురయ్యింది. వివరాల్లోకి వెళితే..

    ''నేను రాసుకున్న 'చచ్చేంత ప్రేమ'ను సినిమాగా తీయడానికి జయలక్ష్మి ఫిలిమ్స్ వారికి హక్కులు ఇచ్చాను. నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తీయాలనుకున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన సన్నాహాల్లో ఉండగానే 'శ్రీమంతుడు' విడుదలైంది'' అని రచయిత శరత్‌చంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. నవలలో ఉన్న కథకు స్వల్ప మార్పులు చేసి, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రం తీశారని జరిగిన మీడియా సమావేశంలో శరత్‌చంద్ర ఆరోపించారు.

    Mahesh's Srimanthudu a copy?

    ''వాస్తవానికి 'శ్రీమంతుడు' రిలీజ్ టైమ్‌లో కేరళలో ఉన్నాను. నా మిత్రులు చెప్పడంతో ఆ సినిమా చూశాను. సినీ రచయితల సంఘంలో ఫిర్యాదు చేశాను. కొంతమంది పరిశ్రమ పెద్దలతో కూడా చెప్పాను. కానీ, న్యాయం జరగలేదు. నాకూ, జయలక్ష్మి ఫిలిమ్స్ సంస్థ వారికీ న్యాయం చేయాలని విన్నవించుకుంటున్నాను'' అన్నారు.

    మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీమంతుడు'. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 7న విడుదలై హిట్ టాక్‌తో వెళ్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ నేటితో 50 రోజులను పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రం 185 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది.

    'శ్రీమంతుడు' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు ట్రైలర్ ని విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడండి.

    ఆగస్టు 7న విడుదలైన 'శ్రీమంతుడు' చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందిన విషయం తెలిసిందే. కోటీశ్వరుడైన ఓ వ్యక్తి గ్రామాన్ని దత్తత తీసుకునే అంశంపై ఈ చిత్రం కథ ఆధారపడి ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేపథ్యంలో గ్రామాల దత్తత కార్యక్రమం వూపందుకున్న విషయం తెలిసిందే.

    మరో ప్రక్క తమ ఊరుని దత్తత తీసుకొని బాగుపరచడమనే ఓ సామాజిక సందేశంతో ముడిపడి ఉన్న సినిమా తీసినందుకు ఇప్పటికే వెంకయ్య నాయుడు, కేటీఆర్ లాంటి రాజకీయ ప్రముఖులు మహేష్‌ను కొనియాడిన విషయం తెలిసిందే.

    English summary
    Sarath Chandra, who writes weekly articles for Swathi Magazine, alleged that he wrote the original Srimanthudu story as “Chachhenta Prema” and is published in Swathi Weekly Magazine in 2012.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X