twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీమంతుడు': ఫ్యాన్స్ కు సరదా పోటీ ఇదిగో...

    By Srikanya
    |

    హైదరాబాద్ :కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం టీమ్ ప్రమోషన్ వేగం పెంచింది. అందులో భాగంగా ఇదిగో ఈ ఛాలెంజ్ విసిరింది. అదేంటో మీరూ ఇక్కడ చూడండి.

    Superstar fans, it's time for us to create a #SrimanthuduSuperStorm! Send in your pics now!

    Posted by Srimanthudu on 25 July 2015

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.

    కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.

    దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.

    Mahesh's Srimanthudu movie offer to Fans

    నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.

    శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది

    English summary
    Srimanthudu movie offer to Fans: Superstar fans, it's time for us to create a #SrimanthuduSuperStorm! Send in your pics now!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X