»   » మహేష్ లేటెస్ట్ గా ఈ వీడియోని ట్వీట్ చేసాడు

మహేష్ లేటెస్ట్ గా ఈ వీడియోని ట్వీట్ చేసాడు

Posted by:
Subscribe to Filmibeat Telugu

మహేష్ ఇంతకు ముందులా కాకుండా ట్విట్టర్ లో స్పీడుగానే ఉంటున్నారు. తన చిత్రాల ప్రమోషన్ కు ట్విట్టర్ ని వేదక చేసుకుంటున్నారు. తాజాగా ఆయన తన చిత్రం ప్రమేషన్ లో భాగంగా విడుదల చేసిన వీడియోని ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ ని ఇక్కడ చూండండి.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p lang="und" dir="ltr"><a href="https://t.co/31n2fWqZPw">https://t.co/31n2fWqZPw</a></p>— Mahesh Babu (@urstrulyMahesh) <a href="https://twitter.com/urstrulyMahesh/status/625171764360839169">July 26, 2015</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

ఇక కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.


Mahesh tweet about Charauseela Song video

కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.


దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.


నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.


Mahesh tweet about Charauseela Song video

శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది


English summary
Mahesh tweeted... about ...Shruti Haasan about Srimanthudu Audio and Chaaruseela song.
Please Wait while comments are loading...