twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్పైడర్: కోలీవుడ్ లొ నిర్మాతలే ఆలస్యం చేస్తున్నారు, కావాలనే

    ప్పుడే వస్తున్న బయ్యర్ల ఆఫర్లను ఈసినిమా నిర్మాతలు ప్రస్తుతం పెండింగ్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూసూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మరియు ఇంకొన్ని చోట్ల కలుపుకుని మహేష్ కు తిరుగులేని స్టార్‌డమ్ ఉంది. అయితే, మిగతా స్టార్ హీరోల్లా మహేష్ ఇప్పటివరకు పక్క రాష్ట్రాలలో పెద్దగా మార్కెట్ మాత్రం క్రియేట్ చేసుకోలేకపోయాడు.

    డైరెక్ట్ గా తమిళ్ లోకి

    డైరెక్ట్ గా తమిళ్ లోకి

    టాలీవుడ్ వరకూ మాత్రమే తన హవా కొనసాగింది అందుకే ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తో ‘స్పైడర్' సినిమా తమిళ్ లో కూడా చేస్తున్నాడు. ఏదిఏమైనా, ఈ సినిమాతో మహేష్ డైరెక్ట్ గా తమిళ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అక్కడ కూడా తన మార్కెట్ ని పెంచుకోవాలనే పనిలో ఉన్నాడు.

    దాదాపు 18 కోట్ల వరకు ఆఫర్లు

    దాదాపు 18 కోట్ల వరకు ఆఫర్లు

    ఈ విషయంలో మురుగదాస్ కూడా తన బెస్ట్ ఇవ్వడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంటే.. మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తదితరులు తమిళ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బాగానే హెల్ప్ చేస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ మార్కెట్ లో మహేష్ సినిమాలకు ఏమాత్రం చెప్పుకోతగ్గ క్రేజ్ లేకపోయినా ఈమూవీకి కోలీవుడ్ బయ్యర్లు దాదాపు 18 కోట్ల వరకు ఆఫర్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    130 కోట్ల వరకూ బడ్జెట్

    130 కోట్ల వరకూ బడ్జెట్

    అదేవిధంగా ఈ మూవీకి బాలీవుడ్ నుండి కూడ మంచి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడో ట్విస్టుంది మహేష్ స్పైడర్ ను కొనడానికి తమిళ బయ్యర్లు తమిళనాడు మొత్తానికి గానూ 20 కోట్ల రూపాయల వరకూ పెట్టటానికి సిద్దంగా ఉండటం ఇప్పటివరకూ తమిళం లో పెద్దగా మార్కెట్ లేని ప్రిన్స్ కి సరిపోతుందేమో గానీ 130 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టిన నిర్మాతలకు మాత్రం ఇది సంతోషకరమైన వార్త మాత్రం కాదు.

    ఒక మైనస్సే

    ఒక మైనస్సే

    ఇప్పటికే స్పైడర్ పై ఎన్నో అంచనాలను పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుంటే.. ఇప్పుడు తమిళనాట 18-20 కోట్లకు మించి చెల్లించడానికి ఎవరూ ముందుకు రాకపోవటం ఒక మైనస్సే. అయితే ఈ మైనస్ కూడా ప్లస్ అయ్యే లా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట మురుగదాస్.

    అసలు సినిమాలో ఎంత దమ్మున్నదీ

    అసలు సినిమాలో ఎంత దమ్మున్నదీ

    ఇప్పుడే వస్తున్న బయ్యర్ల ఆఫర్లను ఈసినిమా నిర్మాతలు ప్రస్తుతం పెండింగ్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ‘స్పైడర్' రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నకొద్దీ తాము చేసే పబ్లిసిటీ వల్ల అసలు సినిమాలో ఎంత దమ్మున్నదీ అర్థమౌతుందనీ, దానివల్ల పెరిగే క్రేజ్ తో మరింత ఫ్యాన్సీ రేట్స్ ‘స్పైడర్' విషయంలో రాబట్టవచ్చు అన్న ఆలోచనలలో ఈసినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్.

    120 కోట్ల బిజినెస్ జరిగే ఆస్కారం ఉంది

    120 కోట్ల బిజినెస్ జరిగే ఆస్కారం ఉంది

    ఇండస్ట్రీలో ప్రస్తుతం వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమాకు దేశవ్యాప్తంగా 200 కోట్ల వరకూ బిజినెస్ జరిగే ఆస్కారం ఉంది అని అని ఒక అంచనా ఉందట అది లెక్క వేసుకున్నాకే ఇప్పటి వరకూ 130 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్టు సమాచామ్ . ఈ బిజినెస్ అంతా మహేష్ మురుగదాస్ ల కాంబినేషన్ వల్ల ఏర్పడుతోందని రానున్న రోజులలో ఈమూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే చాలు.

    100 కోట్ల కలక్షన్స్

    100 కోట్ల కలక్షన్స్

    మొదటి వారంలోనే 100 కోట్ల కలక్షన్స్ వసూలు చేయడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే అనుకున్నట్టు అంతా జరిగితే సరే ఆ 100 కోట్లూ టాలీవుడ్ దాటకుండానే కొట్టే సత్తా ఉన్న సేలబుల్ ఐటం మహేష్ సినిమా, కానీ ఏమాత్రం అటూ ఇటు అయినా పెద్ద నష్టాన్నే ఎదుర్కోవాల్సి వస్తుంది.

    English summary
    As per the buzz n Kollywood, after witnessing the euphoric response for the film's teaser, buyers are offering to the tune of Rs 20 crore for the complete Tamil theatrical rights. This is a huge sum
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X