twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికా మహిళపై రేప్: బాలీవుడ్ దర్శక నిర్మాతకు 7 ఏళ్ల జైలు!

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ చిత్రం 'పీప్లీ లైవ్' చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసిన మహ్మద్ ఫరూఖీకి 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. గతేడాది మార్చి 28న అమెరికా మహిళపై రేప్ చేసిన ఘటన రుజువు కావడంతో ఫరూఖీకి ఈ శిక్ష పడింది. దీంతో పాటు రూ. 50 వేల జరిమానా కూడా విధించారు.

    అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న అమెరికన్ పరిశోధన నిమిత్తం ఢిల్లీ వచ్చారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాత‌ మహ్మద్ ఫరూఖీతో ఆమెకు పరిచయం అయింది. దీనిని అవకాశంగా తీసుకున్న ఫరూఖీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కేసును విచారించిన ఢిల్లీ న్యాయస్థానం ఫరూఖీని దోషిగా తేల్చింది.

    తన పరిశోధనకు అవసరమైన కొన్ని చారిత్రక రిఫరెన్సుల కోసం ఆమె మహమూద్ ఫారూఖీ ని కలిశారు. అలా వీరిమధ్య పరిచయం ఏర్పడిన కొంతకాలం తర్వాత 2015 మార్చి 28న ఫారూఖీ ఢిల్లీ లోని తన ఇంట్లో జరిగిన పార్టీకి ఆమెను కూడా ఆహ్వానించాడు. అనంతరం ఆ మహిళను ఒక గదిలోకి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోస్....

    వేడుకున్నాడు

    వేడుకున్నాడు

    ఈ సంఘటన తర్వాత అమెరికా వెళ్లిపోయిన బాధిత మహిళతో తన తప్పును క్షమించాలని ఫారూఖీ వేడుకున్నాడట.

    ఏడాది విచారణ

    ఏడాది విచారణ

    సుమారు ఏడాదికాలంగా కొనసాగిన విచారణ అనంతరం తీర్పు వెల్లడించిన కోర్టు.. ఆ దర్శకుడే రేప్ చేసినట్లు అన్ని ఆధారాలు లభించాయి.

    ఉత్తరప్రత్యుత్తరాలు

    ఉత్తరప్రత్యుత్తరాలు

    ఫారూఖీతో సదరు మహిళ కొంతకాలం ఉత్తరప్రత్యుత్తరాలు నడిపింది. కొంతకాలం తర్వాత రాయబార కార్యాలయం సహకారంతో ఫారూఖీపై ఫిర్యాదు చేసింది.

    అరెస్ట్

    అరెస్ట్

    015 జూన్ లో పోలీసులు ఆ దర్శకుడిని అరెస్టు చేశారు. నాటి నుంచి విచారణ సాగిన ఈ కేసుకు సంబందించి ఫారూఖీని దోషిగా నిర్ధారించింది.

    పీప్లీ లైవ్

    పీప్లీ లైవ్

    "పిప్లీ లైఫ్" సినిమాకి కో-డైరెక్టరుగా పనిచేసిన ఫారూఖీ.. ఆ సినిమా దర్శకురాలు అనూషా రిజీవికి భర్త!!

    English summary
    Bollywood film 'Peepli Live' co-director Mahmood Farooqui has been sentenced to seven years in jail by a Delhi court for raping an American woman last year. Mr Farooqui, who was present in court today, was given the minimum jail sentence prescribed for the offence by Additional Sessions Judge Sanjiv Jain.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X