twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ పై కిడ్నాప్ విషయమై, అల్లు శిరీష్ డైరక్టర్ ఇలా...

    కిడ్నాప్ విషయమై ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగులో ఒంటరి, మహాత్మ వంటి చిత్రాల్లో నటించిన మలయాళ హీరోయిన్ కిడ్నాప్ కు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం మళయాళ,తమిళ, తెలుగు పరిశ్రమలలో సంచలనం సృష్టించింది. అనేక మంది సినీ సెలబ్రెటీలు తాము ఈ వార్త విని షాక్ అయినట్లే వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాల్సింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా 'అల్లు శిరీష్', మోహన్ లాల్ కాంబినేషన్ లో ....'1971 బియాండ్ బోర్డర్స్' చిత్రం రూపొందిస్తున్న దర్శకుడు మేజర్ రవి స్పందించారు. ఈ విషయమై ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.

    Major Ravi's facebook post about Bhavana attack.

    ఇక మలయాళ నటి ఈ విషయమై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు దుండగలు అతాని ప్రాంతం వద్ద ఆమె కారును అడ్డుకుని అందులోకి చొరబడి దారి మళ్లీంచారు. దాదాపు 25 కిలోమీటర్లు కదులుతున్న కారులో ఆమెను లైగింక వేధింపులకు గురిచేశారు.

    తరువాత పలరివత్తమ్‌ ప్రాంతంలో కారును ఆపి దుండగులు మరో కారులో పరారయ్యారు. ఘటన తరువాత మలయాళ నటి పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేసింది. దుండగులలో ఒకరు తన వద్ద పనిచేసిన డ్రైవరు మార్టిన్‌ అని పేర్కొంది. మరొకరు కూడా ఆమె వద్ద పనిచేసిన సునీల్‌గా పోలీసులు గుర్తించారు.

    మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.కారులో తన చిత్రాలు, వీడియోలు చిత్రీకరించారని మలయాళ నటి పోలీసులకు తెలపడంతో పోలీసులు అపహరణ, వేధింపులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

    ..'1971 బియాండ్ బోర్డర్స్' విషయానికి వస్తే..

    అల్లు శిరీష్ మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. మోహన్‌లాల్‌తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. అది కూడా ఓ యూనివర్సల్ సబ్జెక్ట్ ద్వారా... ఓ మంచి పాత్రతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని శిరీష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

    మోహన్‌లాల్ హీరోగా '1971 బియాండ్ బోర్డర్స్' అనే చిత్రం రూపొందించనున్నాడు. ఈ చిత్రంలోనే అల్లు శిరీష్ ట్యాంక్ కమాండర్‌గా కీలక రోల్ ప్లే చేయనున్నాడు. క్రేజీ డైరెక్టర్ మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకుడు.

    మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. మోహన్‌లాల్‌తో కలిసి నటించే అవకాశం తొలి సినిమాకే రావడం అదృష్టంగా భావిస్తున్నానని, మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు ఇదే సరైన సబ్జెక్ట్ అని భావిస్తున్నామన్నారు. '1971 బియాండ్ బోర్డర్స్' పేరుతో రూపొందిన ఈ చిత్రంలో ట్యాంక్ కమాండర్‌గా ఫుల్‌లెంగ్త్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నానని, ఈ చిత్ర కథ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రూపొందించట్లేదని, హ్యూమన్ డ్రామా, ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రం ప్రతీ భారతీయుడు గర్వపడే రీతిలో ఉంటుందని అన్నారు.

    English summary
    Actor Bhavana has registered a complaint alleging harassment and molestation, after she was kidnapped by her former driver, as per reports. Now Major Ravi's write a facebook post about this actress attack.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X