twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    250 మందికి సూపర్ స్టార్ హార్ట్ ఆపరేషన్స్

    By Srikanya
    |

    వెండితెరమీదే కాదు నిజ జీవితంలోనూ మళయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి హీరో అనిపించుకుంటున్నారు. ఆయన 250 మంది హృద్రోగులకు అండగా నిలిచాడు. ఇందుకోసం తిరువనంతపురంలోని నిమ్స్‌ ఆసుపత్రి యాజమాన్యంతో చేతులు కలిపాడు. నిమ్స్‌ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న హృద్రోగులతో కొద్ది సమయం గడిపేందుకుగాను గురువారం ఈ ఆసుపత్రిని ఆయన సందర్శిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా మమ్ముట్టి మాట్లాడుతూ రెండేళ్ళ కిందటే 100 పేద హృద్రోగులకు ఉచిత బైపాస్‌ సర్జరీలతో పాటు పూర్తిగా ఉచిత చికిత్సకు సంబంధించి నిమ్స్‌తో కలిసి తాము ప్రకటన చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే పథకాన్ని మరో 250 మంది పేద రోగులకు వర్తింపజేయాలని నిర్ణయించామన్నారు.

    ఈ నెలలో 58 ఏళ్ళ వయసుకు చేరుకుంటున్న మమ్ముట్టి, తన అభిమాన సంఘాల తోడ్పాటుతో ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేద హృద్రోగులకు శస్త్రచికిత్సలు మాత్రమేగాక ఉచితంగా క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్సలకు కూడా చేయిస్తున్నారు. నటుడు మమ్ముట్టి దాతృత్వాన్ని నిమ్స్‌ ఎండీ ఫైజల్‌ ఖాన్‌ ప్రశంసించారు. ''వైద్య శిబిరాల ద్వారా మమ్ముట్టి అభిమానులు హృద్రోగులను గుర్తించారు. రోగుల ఆర్థిక పరిస్థితిని కూడా క్షుణ్ణంగా పరీక్షించి నిరుపేద రోగులను ఎంపిక చేశారు. వీరిని మా ఆసుపత్రిలో చేర్చిన తర్వాత పూర్తి చికిత్స అందించి పంపిస్తాం'' అని చెప్పారు.

    English summary
    Mammootty will sponsor another 250 heart patients by joining hands with the NIMS Hospital here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X