twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ నామినేషన్ ఎంట్రి: తెలుగు నుంచి ఇవే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఆస్కార్ అవార్డుల పండుగకు అప్పుడే హడావిడి మొదలైంది. మన దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంట్రీకి పంపే చిత్రాలను ఎంపిక చేసే పనిలో స్క్రీనింగ్ కమిటీ బిజీ అయిపోయింది. ఉత్తమం విదేశీ చిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరుపున అథికారిక ఎంట్రీగా 30 సినిమాలును మన ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. వాటిలో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి.

    ఆ తెలుగు సినిమాలులో ఒకటి మనం, మరొకటి మిణుగురులు. అలాగే ఇతర భాషా చిత్రాలను పరిశీలిస్తే...ఇప్పటికే జాతీయ అవార్డును కైవసం చేసుకున్న బెంగాళీ చిత్రం జతీశ్వర్, మరాఠీ చిత్రం ఫండ్రీ, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ చిత్రం షాహిద్ లు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే మర్ధానీ, ఫిల్మీస్దాన్, సంజయ్ లీలా భన్సాలీ రామ్ లీలా, మేరీ కోమ్ కూడా ఉన్నాయి. ఇక తమిళం నుంచి కొచ్చడయనా, కదై తిరక్కదై వసనమ్ ఇయక్కమ్ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు కొన్ని కొంకణీ చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి.

    Manam & Minugurulu for Oscar Nominations

    ఎఫ్. ఎఫ్. ఐ నియమించనున్న స్క్రీనింగ్ కమిటీ బుధవారం నుంచీ ఈ చిత్రాలన్నీ చూసి, మన దేశం నుంచి పంపే ఎంట్రీని ఖరారు చేస్తుంది. ఈ సినిమాలు స్క్రీనింగ్ లు అన్ని హైదరాబాద్ లోజరగనున్నాయి. అన్ని చిత్రాలునూ కమిటీ చూసి, ఈ నెల 23 నుంచి తుది నిర్ణయాన్ని ఖరారు చేస్తాయి.

    ఇక మన తెలుగు చిత్రాలు విషయానికి వస్తే..మనం చిత్రం అక్కినేని నాగేశ్వరరావుగారి ఆఖరి చిత్రం. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మూడు తరాల నటులు అంటే నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య నటించటం విశేషం. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

    మిణుగురులు విషయానికి వస్తే... అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి దర్శక నిర్మాతగా 40 మంది అంధ బాలలతో తెరకెక్కించిన చిత్రం `మిణుగురులు'. రెస్పెక్ట్ క్రియేషన్‌‌స పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో ఆశిష్‌ విద్యార్థి, సుహాసిని మణిరత్నం, రఘువీర్‌ యాదవ్‌, దీపక్‌, రుషిక ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ టెక్నీషియన్‌‌స పనిచేశారు. ఈ చిత్రం విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇప్పటికే ఏడు ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌‌సకి ఈ చిత్రం ఎంపికైంది. 18వ ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రానికి ఎన్.వి.బి. చౌదరి కథ అందించారు. ఈ చిత్రం కథ, కథనం అందరి ప్రశంసలు పొందింది.

    English summary
    Currently Indian Govt is scrutinising films for its official nomination at Oscars,next year. More than 30 films came in front of Film Federation of India for screening. There are two telugu films also. One is Akkineni's generational entertainer Manam and Ayodhya Kumar's Minugurulu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X