» 

అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’ ఫస్ట్ లుక్ (ఫోటో)

Posted by:

హైదరాబాద్: అక్కినేని మూడు తరాల హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జు, నాగచైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'మనం' ఫస్ట్ లుక్ విడుదలైంది. సెప్టెంబర్ 20న ఏఎన్ఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఫస్ట్ లుక్ డిజిటల్ పోస్టర్ విడుదల చేసారు.

శ్రీమతి అన్నపూర్ణ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఇష్క్ మూవీ ఫేం విక్రమ్ కుమార్ 'మనం' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మనం గురించి నిర్మాత నాగార్జున మాట్లాడుతూ..'నాన్న 90వ బర్త్ డే సందర్భంగా 'మనం' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. నాన్న, నేను, చైతన్య కలిసి నటిస్తున్న ఈ చిత్రం నాకు కొత్త అనుభూతి కలిగిస్తోంది. మా బేనర్లో ఈ చిత్రం ఓ ప్రెస్టీజియర్ చిత్రం అవుతుంది' అన్నారు.

దర్శకుడు విక్రమ్ కుమార్ మాట్లాడుతూ...'నాగేశ్వరరావు గారు, నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పెద్దలు నాగేశ్వరరావుగారి ఆశీస్సులతో ఈచిత్రాన్ని చేస్తున్నాను. ఫస్ట్ లుక్ గెటప్స్ డిఫరెంటుగా ఉన్నట్లుగానే సినిమా కూడా చాలా డిఫరెంటుగా ఉంటుంది' అన్నారు.

వందశాతం కామెడీతో మంచి లవ్ ఫీల్‌తో మంచి ఎమోషనల్‌తో 'మనం' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావు గారికి 90 ఏళ్లు వచ్చినా సెట్‌లో అందర్నీ నవ్విస్తూ ప్లెజెంట్ ఎట్మాస్పియర్‌ని క్రియేట్ చేస్తారు. యూనిట్లో అందరికంటే ఎనర్జిటిక్‌గా ఉంటూ అందరినీ ఉత్సాహపరుస్తారు. ఆయనొక లెజెంట్. లెజెండ్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు దర్శకుడు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వై.సుప్రియ మాట్లాడుతూ..'అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో రేర్ కాంబినేషన్‌లో వస్తున్న 'మనం' అందరి అంచనాలను రీచ్ అవుతుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతోంది. నవంబర్ కల్లా నిర్మాణం పూర్తవుతుంది. ప్రేక్షకులను, అక్కినేని అభిమానులను 'మనం' ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమ్ కుమార్ ఈ సబ్జెక్టని బాగా డీల్ చేస్తున్నారు' అన్నారు.

ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

Read more about: nagarjuna, akkineni nageswara rao, naga chaitanya, manam, t subbarami reddy, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, మనం, టి సుబ్బిరామిరెడ్డి
English summary
The first look of the film Manam starring Akkineni Nageswara Rao with his son Nagarjuna and grandson Naga Chaitanya is released.

Telugu Photos

Go to : More Photos