twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కె.రాఘవేంద్రరావు, తమన్నా కలిసి...(ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: మంచులక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'దొంగాట'. అడవి శేషు, మధుసూదన్‌ ఇతర ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రఘు కుంచె సంగీతమందించిన ఈ సినిమా పాటలను చిత్ర బృందం హైదరబాద్‌లో విడుదల చేశారు. సినీ నటుడు మోహన్‌బాబు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తమన్నా, మధుశాలిని, సుమంత్‌, నరేశ్‌, మంచు విష్ణు, మంచు మనోజ్‌ తదితరులు హాజరై పాటలను ఆవిష్కరించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    విద్యా నిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మీప్రసన్న నటించి, నిర్మించిన చిత్రం 'దొంగాట'. అడివి శేష్, మధు నందన్ ముఖ్య పాత్రలు చేశారు. రఘు కుంచె, సాయి కార్తీక్, సత్య మహావీర్ పాటలు స్వరపరిచారు

    ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మోహన్ బాబు మాట్లాడుతూ ‘నాకు ఎప్పుడూ మంచు లక్ష్మీ ని సింగర్ గా చూడాలనే కోరిక ఉండేది. ఈ సినిమాతో ఆ కల నెరవేరడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో గర్వంగా గొప్పగా ఉంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ వాయిస్ నాకు ఒక్కసారిగా అలనాటి ప్లే బ్యాక్ సింగర్ ఎల్.ఆర్ ఈశ్వరిని గుర్తు చేసిందని' అన్నారు. అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాతో వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

    లోగో లాంచ్...

    లోగో లాంచ్...

    మంచు మ్యూజిక్ లోగో ని నిర్మలమ్మని, మంచు విష్ణు, అరియానా, విరియానా, నిర్వాణ ల స్టేజీ మీదకు రాగా...రాఘవేంద్రరావు గరి చేతుల మీదుగా లాంచ్ అయ్యింది.

    పాటల సీడిని

    పాటల సీడిని

    హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో పాటల సీడీని మోహన్‌బాబు ఆవిష్కరించారు.

    మోహన్ బాబు మాట్లాడుతూ...

    మోహన్ బాబు మాట్లాడుతూ...

    ''సినిమా నిర్మాణం అంత సులువు కాదని మహానటుడు శివాజీ గణేశన్ నాతో అనేవారు. 'నటుడిగా సంపాదించిన డబ్బు జాగ్రత్త చేసుకో! చేతులు కాలితే ఎవరూ సహాయం చేయరు' అనేవారాయన.

    అలాగే...

    అలాగే...

    నిర్మాణం అంత సులువు కాదని నాకు తెలుసు. కానీ, సినిమాలు నిర్మించాను. అయితే, నా బిడ్డ లక్ష్మి నిర్మాతగా చేస్తానంటే ప్రోత్సహించలేదు. అయినా చేసింది. ఈ చిత్రం రషెస్ చూశాను. అద్భుతమైన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని నటుడు మోహన్‌బాబు అన్నారు.

    మోహన్‌బాబు కంటిన్యూ చేస్తూ....

    మోహన్‌బాబు కంటిన్యూ చేస్తూ....

    ''రామారావుగారు, నాగేశ్వరరావు, దాసరి గార్ల నుంచి ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఇప్పటి తరంలో క్రమశిక్షణ లేదు. ఎవరో కొందరు మాత్రం క్రమశిక్షణగా ఉంటున్నారు. ఆ సంగతలా ఉంచితే, లక్ష్మిని చక్కగా చదువుకుని, గృహిణిగా స్థిరపడమని చెప్పాను. ఆమెబాగా చదువుకుంది. కానీ, సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఓ తండ్రిగా తనకు మంచి చిత్రాలు తీయమని చెప్పాను. మంచి సినిమాలు చేస్తోంది.

    వాస్తవానికి..

    వాస్తవానికి..

    వాస్తవానికి మా లక్ష్మి మంచి గాయని అయితే బాగుంటుందనుకున్నాను. ఎస్పీ బాలు, జేసుదాసు వంటి గాయకుల దగ్గర నా కోరిక చెబితే, 'పాటలెందుకు? చక్కగా చదువుకొమ్మ'న్నారు. మద్రాసులో ఓ విద్వాంసుడు దగ్గర చేర్పిస్తే, పాటలు వదిలేసి, వంటలు నేర్చుకుంది. మొత్తం మీద గాయని కాలేదు. ఇప్పుడు ఈ చిత్రంలో తను పాడిన పాట విని, నమ్మలేకపోయాను. చాలా బాగా పాడింది. ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ఎల్.ఆర్. ఈశ్వరి గొంతును గుర్తు చేసింది. నాకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు

    ఎవరూ ప్రదర్శించలేదు

    ఎవరూ ప్రదర్శించలేదు

    . ''ఏ ఆర్టిస్ట్ ప్రతిభ అయినా బయటికొచ్చేది ప్రతినాయకుడిగా చేసినప్పుడే! భారతదేశంలో ప్రతినాయకుడిగా నేను ప్రదర్శించినన్ని హావభావాలు వేరే ఏ నటుడూ ప్రదర్శించలేదు'' అని మోహన్ బాబు అన్నారు.

    లక్ష్మి మాట్లాడుతూ-

    లక్ష్మి మాట్లాడుతూ-

    ''నేను సింగర్ కావాలని నాన్న చాలా తపన పడ్డారు. నేనేం చేసినా మా నాన్నగారు గర్వపడేలా చేయాలనుకుంటాను. ఈ పాట మా నాన్నను గర్వపడేలా చేస్తుందనుకుంటున్నాను'' అన్నారు.

    తమన్నా మాట్లాడుతూ...

    తమన్నా మాట్లాడుతూ...

    ఈ వేడుకలో పాల్గొన్న తమన్నా, మంచు కుటుంబంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ''హీరోయిన్‌గా నేను పరిచయమైంది మోహన్‌బాబు గారి బ్యానర్‌లోనే. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం - ఈ కుటుం బమే. ఈ చిత్ర దర్శకుడు వంశీకృష్ణ నా తొలి చిత్రం 'శ్రీ' నాటి నుంచి తెలుసు'' అన్నారు.

    రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ...

    రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ...

    లక్ష్మీ...ఎదురుగా..గ్లామర్ అమ్మాయి తమన్నా వంక చూసి మాట్లాడుతా..ఇన్సిప్రేషన్ వస్తుంది..అందరికీ నమస్కారం..మోహన్ బాబు గారు వినండి... మంచు లక్ష్మి..ఈ పిక్చర్ వరకూ మంచి దొంగ..టైటిల్ లోనే దొంగాట అని పెట్టింది. దొంగాట అంటే దొంగలని వదులుతున్నావు అంటూ చమత్కరించారు.

    ఎవరెవరు...

    ఎవరెవరు...

    కె. రాఘవేంద్రరావు, విష్ణు, మనోజ్, సుమంత్, మధుశాలిని, దేవి, నిర్మల, అడివి శేష్ తదితరులు పాల్గొన్నారు.

    పాట పాడింది

    పాట పాడింది

    దొంగాట సినిమాలో మంచు లక్ష్మీ నటిగానే, నిర్మాతగానే కాకుండా ఈ సినిమాలో ఓ పాట పాడింది. ఆ పాటకి యు ట్యూబ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి.

    English summary
    Dongata Telugu Movie Audio Launched. Starring Lakshmi Manchu, Adivi Sesh, Brahmanandam, Madhu Nandan, JP, Giri Babu, Anapurnamma, Pruthvi and guest appearance by Rana Daggubati & Manchu Manoj.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X