» 

డీజీపీ ఆఫీసులో మంచు మనోజ్ - ఏమైంది?

Posted by:

హీరో మంచు మనోజ్ బుధవారం రాష్ట్ర పోలీస్ బాస్ డిజీపీ ఆఫీసులో ప్రత్యక్ష్యం అయ్యారు. విషయం ఏమిటా అని ఆరా తీస్తే ఇటీవల మనోజ్ నటించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడారా' చిత్రం పైరసీ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

జూలై 27న విడుదలైన 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం నెగెటివ్ రివ్యూలకు తోడు పైరసీ భూతం కూడా వెంటాడుతుండటంతో సినిమాకు అనుకున్న కలెక్షన్లు రావడం లేదు. రెండు రోజుల క్రితమే ఈ చిత్రాన్ని పైరసీ చేస్తున్న వారు అనంతపురంలో పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో పైరసీపై గట్టి చర్యలు తీసుకోవాలని మనోజ్ డీజీపీ దినేష్ రెడ్డిని మనోజ్ కోరినట్లు తెలుస్తోంది.

ఇటీవల రాజమౌళి తన 'ఈగ' చిత్రం పైరసీ విషయంలో కూడా తీవ్రంగా స్పందించారు. ఈనేపథ్యంలో పలువురు అరెస్టయ్యారు కూడా. అయినా పైరసీ మూలంగా జరిగే నష్టాన్ని మాత్రం ఆపలేక పోయారు. తాజాగా మంచు ఫ్యామిలీ కూడా పైరసీ గళం ఎత్తింది. ఇలా తమ సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కాకుండా పైరసీపై అందరూ ఏకతాటిపై నిలబడి పోరాడితే దీన్ని అరికట్టడం సాధ్యమే అంటున్నారు నిపుణులు.

బాలయ్య ముఖ్య పాత్ర పోషించిన 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రాన్ని మంచు ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై మంచు లక్ష్మి నిర్మించిన ఈచిత్రానికి శేఖర్ రాజా దర్శకుడు. బెబో శశి సంగీతం అందించారు. ఈచిత్రం కోసం రూ. 6 కోట్లు వెచ్చించి గాంధర్వ మహల్ నిర్మించారు.

Read more about: balakrishna, uu kodathara ulikki padathara, manchu manoj, lakshmi prasanna, ఊ కొడతారా ఉలక్కి పడతారా, మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్న
English summary
Telugu hero Manchu Manoj went to DGP office today and submit a plea regarding curbing piracy in Tollywood. The anti piracy team of 'Uu Kodathara Ulikki Padathara' has caught a major pirate in Anantapur recently.
Please Wait while comments are loading...