» 

హీరో మంచు విష్ణు కండల వీరుల పోటీలు (ఫోటోలు)

Posted by:

హైదరాబాద్: హీరో మంచు విష్ణు ఇండియాలోనే బిగ్గెస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌‌కు స్పాన్సర్‌గా వ్యవహరించారు. భాగ్యనగర్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వారు ఈ పోటీలను నిర్వహించారు. మంచు విష్ణు స్పాన్సర్‌గా వ్యవహరించిన ఈ పోటీలకు 'విష్ణు మంచు మిస్టర్ భాగ్య నగర్-2014' పేరుతో నిర్వహించారు.

ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి హైదరాబాద్ వనస్థలి పురంలోని గణేష్ టెంపుల్ కాంప్లెక్స్ ఓపెన్ ఆడిటోరియంలో ఈ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా మంచు విష్ణు విజేతలకు బహుమతి అందజేసారు. మంచు విష్ణు మాట్లాడుతూ ఇలాంటి స్పోర్ట్స్ ను ప్రోత్సహించడం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ప్రతి ఒక్కరు జిమ్ చేయాలని, శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవాలని మంచు విష్ణు సూచించారు.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు....

ప్రైజ్ మనీ వివరాలు...


ఈ పోటీల్లో టైటిల్ విన్న‌ర్‌కు రూ. లక్ష రూపాయల ఫ్రైజ్ మనీతో పాటు ట్రోపీ అందజేసారు. 2వ, 3వ స్థానం దక్కించుకున్న వారికి సైతం క్యాష్ ఫ్రైజ్, సర్టిఫికెట్ అందజేసారు. టోటల్ ఫ్రైజ్ మనీ రూ. 5 లక్షలు మంచు విష్ణు స్పాన్సర్ చేసినట్లు భాగ్యనరగ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెల్లడించారు.

మిస్టర్ భాగ్యనగర్


మిస్టర్ భాగ్యనగర్ పోటీల్లో విజేతగా నిలిచిన వ్యక్తికి టైటిల్ అందజేస్తున్న మంచు విష్ణు. దీంతో పాటు రూ. లక్ష ఫ్రైజ్ మనీ అందజేసారు.

సాయి కిరణ్


ఇతర విజేతలకు బహుమతి అందజేస్తున్న తెలుగు సినిమా నటుడు సాయి కిరణ్

బహమతులు అందజేస్తున్న దృశ్యం


విజేతలకు బహుమతులు అందజేస్తున్న దృశ్యం. ఈ పోటీలకు మంచు విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 

Read more about: manchu vishnu, mohan babu, manchu manoj, pandavulu pandavulu tummeda, మోహన్ బాబు, మంచు మనోజ్, మంచు విష్ణు, పాండవులు పాండవులు తుమ్మెద
English summary
Body Building Competition titled ‘Vishnu Manchu Mr. Bhagyanagar 2014’ held at Ganesh Temple Complex Open Auditorium, Vanasthalipuram yesterday.
Please Wait while comments are loading...