twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమీర్ ఖాన్ వివాదాస్పద కామెంట్ పై...మంచు విష్ణు

    By Srikanya
    |

    హైదరాబాద్ : దేశంలో మత అసహనం పెరిగిపోతోందంటూ కొందరు రచయితలు, సినీమా సెలబ్రిటీలు తమ అవార్డులు వెనక్కి ఇవ్వడం దేశంలో హాట్ టాపిక్ అయింది. ఈ విషయంలో ఆ మధ్య షారుక్ ఖాన్ చేసిన కామెంట్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి. తాజాగా అమీర్ ఖాన్ తన ట్విట్టర్లో మరో కామెంట్ చేసి ఈ వివాదాన్ని మరింత పెంచారు.

    తన భార్య కిరణ్ రావు భారత్ వదిలి వెళ్లిపోదామని అడుగుతోంది అంటూ ట్వీట్ చేసారు. ఈ విషయమై దేశమంతటా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది ఈ విషయమై స్పందించారు. తాజాగా తెలుగు హీరో మంచు విష్ణు సైతం స్పందించారు. ఆయన ఏమన్నారో క్రింద చూడండి.

    This great country.India is what has made u AAMIR KHAN.We r not in Afghanistan,to feel so insecure.For record, As an actor I love Aamir Khan

    Posted by Vishnumanchu on 24 November 2015

    మరో ప్రక్క ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. హిందూ దేశం ‘ఇండియా'లో ముస్లిం వర్గానికి చెందిన అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ టాప్ స్టార్లుగా ఎదిగారు. మరి దేశంలో మత అసహనం ఎక్కడ ఉందో నాకైతే అర్థం కావడం లేదు అంటూ ట్వీట్ చేసారు. ఒక హిందూ దేశంలో ముగ్గురు ముస్లింలు స్టార్లుగా వెలుగుగొందుతున్నారంటే మెజారిటీ ప్రజలు అసహనంతో లేరని రుజువుచేస్తోంది. అలాంటి పరిస్థితులే ఉంటే ఈ ముగ్గురు ఇంత పెద్ద స్టార్లు గా ఎదిగేవారే కాదు అని వర్మ అభిప్రాయ పడ్డారు.

    Manchu Vishnu comment on Ameer Khan's intolerance.

    సెలబ్రిటీలుగా పరిగణింపబడుతున్న, ఎవరైతే అసహనం గురించి మాట్లాడుతున్నారో... వారు విమర్శిస్తున్న దేశంలోనే సెలబ్రిటీలుగా ఉన్నారనే విషయం మరిచిపోవద్దు. కొన్ని ఘటనల మూలంగా అసహనం ఉన్నట్లుగా చిత్రీకరించడం సరికాదు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

    కొందరు సెలబ్రిటీలు దీన్నో వివాదంగా చేసి డ్రాయింగ్ రూమ్ డిబేట్లకు తెరలేపుతున్నారు. తద్వారా తమ పాపులరిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీన్ని వల్ల కమ్యూనిటీల మధ్య నెగిటివిటీ పెరుగుతుంది. మీరు నిజంగా ఫ్యామిలీ లాగా ఫీలైతే... ఫ్యామిలీలో సమస్య వస్తే ఫ్యామిలీ మెంబర్స్ తమ ప్రజల్లోకి వచ్చి మా ఫ్యామీలీలో అసహనం ఉందని చెప్పుకోరు అని వర్మ ట్వీట్ చేసాడు.

    English summary
    Manchu Vishnu on Aamir Khan comments on intolerance.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X