twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కథ మీద ఏడేళ్లుగా పని చేస్తున్నాడు

    By Srikanya
    |

    ముంబై: మణిరత్నం ఓ కథని నమ్మితే అందుకోసం చాలా శ్రమస్తూంటారని ఆయనతో పనిచేసిన వాళ్లు చెప్తూంటారు. రీసెంట్ గా ఆయన ఓ కథ మీద గత ఏడేళ్లుగా పనిచేస్తున్నారు. మణిరత్నం కోసం మరో దర్శకుడు రెన్సిల్‌ డిసిల్వా పనిచేయనున్నారు. ఇద్దరూ కలిసిన ఈ ప్రాజెక్ట్‌ ఓ బయోపిక్‌ కోసం. ఇంతకీ ఎవరి జీవిత కథ? అది మాత్రం సస్సెన్స్‌. ఈ కథ మీద వీళ్లిద్దరూ కలిసి ఏకంగా ఏడేళ్ల నుంచి పని చేస్తున్నారు.

    రెన్సిల్‌ గతంలో 'రంగ్‌ దే బసంతి', 'కుర్బాన్‌', 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌', 'ఉంగ్లీ' సినిమాలకు స్క్రిప్ట్‌ రూపొందించారు. బయోపిక్‌ కోసం రెన్సిల్‌ రాసిన స్క్రిప్ట్‌ మణిరత్నంకు తెగ నచ్చేసింది. దాంతో ఆయన్నే దర్శకత్వం వహించమని కోరారు.

    Maniratnam coming with a biopic

    'మేమిద్దరం కలిసి 2007 నుంచి ఈ పని మీద ఉన్నాం. ఇది క్రీడాకారుడికో, సమరయోధుడికో సంబంధించిన జీవిత కథ కాదు. నిరుపేద స్థితి నుంచి సంపన్నుడిగా మారిన ఓ వ్యక్తి కథ. అతడొక పెద్ద కంపెనీని స్థాపించి ఎదిగాడు' అని రెన్సిల్‌ చెబుతున్నారు. అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌లతో 2010లో 'రావణ్‌' తీసిన తర్వాత మణిరత్నం తదుపరి చిత్రం ఇదే అవుతుంది.

    English summary
    Director Maniratnam is getting ready for a biopic. Buzz is director Rensil D Silva is penning a script for the film. Inside talk is both have been working on the script for more than 7 years.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X