» 

కొవ్వెక్కిన మనోజ్... ఇప్పుడేమో తంటాలు!

Posted by:

హైదరాబాద్: మిస్టర్ నూకయ్య, ఊ కొడతరా ఉలిక్కి పడతారా చిత్రాల వరుస షూటింగులతో సరిగా డైట్ మెయింటేన్ చేయని హీరో మంచు మనోజ్ తాజాగా 6 కిలోల బరువెక్కి పోయాడు. దీన్ని ఇలానే నిర్లక్ష్యం చేస్తే హీరో పర్సనాలిటీ దెబ్బతింటుందనే ఆలోచనకు వచ్చిన మనోజ్...ఇప్పుడు బాడీలో పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి బ్యాంకాక్ వెళ్లి తంటాలు పడుతున్నాడు.

ఈ విషయమై మనోజ్ వివరిస్తూ...'చివరి మూడు నెలల్లో 6 కిలోల బరువు పెరిగి పోయాను. బరువు తగ్గించుకోవడానికి ట్రీట్ మెుంట్ తీసుకుంటున్నాను. ఇదొక పెయిన్ ఫుల్ ఫన్' చెప్పుకొచ్చాడు. అదే విధంగా సినిమా షూటింగుల్లో స్టంట్స్ చేస్తుండగా అయిన గాయాలకు కూడా చికిత్స చేయించుకుంటున్నాడు.

ఇక పోతే మనోజ్‌కు చాలా కాలంగా సరైన హిట్ లేకుండా పోయింది. ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన 'మిస్టర్ నూకయ్య' చిత్రం బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. నట సింహం బాలకృష్ణతో కలిసి చేసిన 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం కూడా బొక్క బోర్లా పడింది. ఈ చిత్రం మనోజ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించినా ఫలితం లేకుండా పోయింది.

'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రానికి శేఖర్ రాజా దర్శకత్వం వహించగా మంచు లక్ష్మి ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తమిళంలో 'వరువన్ తలైవన్' పేరుతో విడుదల చేసారు. ఈ చిత్రం ద్వారా మనోజ్ తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.

Read more about: manchu manoj, uu kodathara ulikki padathara, lakshmi prasanna, మంచు మనోజ్, ఊ కొడతారా ఉలక్కి పడతారా, లక్ష్మీ ప్రసన్న
English summary
“I ended up gaining six kilos in the last three months due to medical treatments. It feels good to be back home, after a while and I have a new work out plan scheduled. It’s going to be some painful fun,” says Manoj.

Telugu Photos

Go to : More Photos