twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాకోసం రిస్క్ తీసుకున్నాడు, వేగంగా 12 కిలోలా...: ఈరోజు బర్త్ డే కూడా...

    ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే కానీ ఇదే రోజు మంచు మనోజ్ కూడా పుట్టాడు.... ఈ రోజునే మనోజ్ కొత్త సినిమా ఒక్కడు మిగిలాడు కి సంబందించిన ఇంకో లుక్ ని కూడా రిలీజ్ చేసారు... మనోజ్..

    |

    మనోజ్ బాల్యంలో తన పదోయేటనే మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించాడు. 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి కథానాయకుడిగా పరిచయమయ్యాడు.బిందాస్ సినిమాకుగానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటినుంచీ సినిమాలలో కొన్సాగలనే ఆశ తపనా ఉన్నా... పాపం ఇప్పటికీ సరైన హిట్ ఒక్కటీ అందక ఇంకా కష్ట పడుతూనే ఉన్నాడు. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే కానీ ఇదే రోజు మంచు మనోజ్ కూడా పుట్టాడు.... ఈ రోజునే మనోజ్ కొత్త సినిమా ఒక్కడు మిగిలాడు కి సంబందించిన ఇంకో లుక్ ని కూడా రిలీజ్ చేసారు...

    ఒక్కడు మిగిలాడు

    ఒక్కడు మిగిలాడు

    ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం "ఒక్కడు మిగిలాడు". అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

     టైగర్ వేలుపిల్లై ప్రభాకరన్

    టైగర్ వేలుపిల్లై ప్రభాకరన్

    మంచు మనోజ్ ఎల్టీటీఈ టైగర్ వేలుపిల్లై ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. లేటెస్ట్ పోస్టర్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. తొలిసారిగా తాను డ్యూయల్ రోల్స్ పోషిస్తున్న సినిమా అని పేర్కొన్నారు మంచు మనోజ్.అదీ ఒకప్పుడు భారత ప్రధాని హత్య తో ఒక్కసారి ప్రపంచం దృష్టినే ఆకర్షించిన తమిళ పులి ప్రభాకరన్ పాత్ర. ఉగ్రవాదం లో మొదటిసారి మానవ బాంబు ని ఉపయోగించింది ఎల్టీటీయీ నే కావటం గమనార్హం.

    తమిళులకి ప్రత్యేక రాజ్యం

    తమిళులకి ప్రత్యేక రాజ్యం

    శ్రీలంకలో వున్న తమిళులకి ప్రత్యేక రాజ్యం, స్వేచ్ఛా ప్రపంచం కోసం 1976లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం పేరిట ప్రభాకరన్ ఏర్పాటు చేసిన మిలిటెంట్ సంస్థని ఆ తర్వాతి కాలంలో శ్రీలంక ప్రభుత్వం టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించింది. శ్రీలంకకి పక్కలో బళ్లెంలా మారి దాదాపు 25 ఏళ్లు పోరాడిన ప్రభాకరన్‌ని 2009లో మే 18న శ్రీలంక ఆర్మీ దళాలు హతమార్చాయి.

     శ్రీలంక, భారత్ దేశాల మధ్య

    శ్రీలంక, భారత్ దేశాల మధ్య

    ప్రభాకరన్‌ని మట్టుపెట్టడం కోసం దాదాపు రెండు దశాబ్ధాలపాటు శ్రీలంక, భారత్ దేశాల మధ్య పెద్ద సెర్చ్ ఆపరేషనే జరిగింది. ఈ కథా నేపథ్యంతోనే మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు తెరకెక్కుతోంది. రెండు సరికొత్త క్యారెక్టర్స్ లో ఎంటర్ టైన్ చేయనున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

    రెండో పాత్ర లుక్

    రెండో పాత్ర లుక్

    ఒకవైపు వ్యవస్థకి విరుద్ధంగా పోరాడే వీరుడిగా, మరో వైపు ప్రస్తుత పరిస్థితుల మధ్య నలుగుతున్న వ్యవస్థను ట్రాక్ పై పెట్టే లీడర్ లా కనిపించనున్నాడట మనోజ్. ఆ రెండో పాత్ర కి సంబందించిన లుక్ నే నిన్న విడుదల చేసారు. రెండు పాత్రల మధ్య వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. మామూలుగా మనోజ్ నటనలో లోప ఎక్కడా కనిపించదు ఏ పాత్రకోసమైనా 100 శాతం కష్టపడతాడు. పూర్థి స్థాయి పరిణితి చూపిస్తాడు అయినా ఇప్పటివరకూ ఎందుకనో మనోజ్ కి అతని స్థాయికి తగ్గ బ్రేక్ రాలేదు.

    12 కిలోల బరువు తగ్గాడట

    12 కిలోల బరువు తగ్గాడట

    మనోజ్.. రెండో పాత్ర కోసం 12 కిలోల బరువు తగ్గాడట. రెండు పాత్రలు సినిమాలో పూర్తి భిన్నంగా.. ఇద్దరూ ఒకరేనా అనిపించేలా ఉంటాయని.. మనోజ్ కెరీర్లో ఇది బెస్ట్ సినిమా.. బెస్ట్ పెర్ఫామెన్స్ అవుతుందని అంటున్నాడు దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ లేదా జులైలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్ నటించింది. ఎస్.ఎస్.రెడ్డి నిర్మించాడు.

    English summary
    Manoj lost nearly 12 kgs for the second role, in which he is going to play a college student for his New Movi Okkadu migiladu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X