twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమించి....సెక్స్ స్కాండల్ లో ఇరుక్కుని (వీడియో)

    By Srikanya
    |

    హైదరబాద్‌: సెక్సా స్కాండిల్ లో ఇరుక్కున్న ఓ యువతి ప్రేమ కథ ఇతివృత్తంగా తయారైన చిత్రం'మసాన్‌'. ఈ చిత్రం ప్రతిష్ఠాత్మక కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రాన్ని త్వరలో భారత్‌లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ముంబయిలో విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని మీరూ చూడండి

    నీరజ్‌ గ్యావన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రిచాచద్దా, శ్వేత త్రిపాఠి కీలక పాత్రలు పోషించారు. జులై 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    పుణ్యక్షేత్రం వారణాసి నేపథ్యంగా ఈ చిత్రాన్ని నీరజ్ తెరెక్కించారు. గంగానది ఒడ్డున నాణేలు ఏరుకుంటూ జీవనం సాగించే అనాథ యువకుడు, శ్మశాన వాటికలో పనిచేసే తక్కువ కులానికి చెందిన మరో యువకుడు అగ్రవర్ణ యువతితో ప్రేమలో పడుతారు. ఆ యువతి తండ్రి, మరో మహిళ సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుపోతారు.

    వారి జీవితంలో ఏం జరిగింది? సమాజంలో ఎదురైన ప్రతికూల పరిస్థితులను వారు ఎలా ఎదుర్కొన్నారనే కథతో మసాన్‌ను తెరకెక్కించారు. మసాన్ అనగా హిందీలో శ్మశానవాటిక అని అర్థం. ఈ చిత్రాన్ని భారత, ఫ్రాన్స్ దేశాల సహకారంతో నిర్మించారు.

    2015 చిత్రోత్సవంలో భాగంగా అన్ సర్టయిన్ రిగార్డ్ విభాగంలో నీరజ్ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం మసాన్ రెండు అవార్డులను సొంతం చేసుకున్నది. ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్, ప్రామిసింగ్ ఫ్యూచర్ పురస్కారాలను అందుకున్నది. ఆంగ్లంలో అవే సోలో పేరుతో కేన్స్‌లో ప్రదర్శించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలూ లభించాయి.

    'Masaan' trailer reveals dark side of Indian society

    తొలి చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించిన నీరజ్ హైదరాబాద్‌లోని సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పూణెలోని సింబాయసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎంబీఏ పూర్తి చేశారు. ప్రముఖ కంపెనీలో ఆరేండ్లపాటు ఉద్యోగం చేసిన నీరజ్ సినిమా మీద ఉన్న వ్యామోహంతో సినీరంగంలోకి ప్రవేశించారు.

    ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ చిత్రానికి సహాయదర్శకుడిగా పనిచేశారు. షోర్, ఎపిఫానీ అనే సంక్షిప్త చిత్రాలను నిర్మించారు. ప్రీ ప్రొడక్షన్, సినీ నిర్మాణంపై పరిశోధన చేస్తూనే గోడబ్ల్యూ అనే పుస్తకాన్ని రచించారు. ఈ సమయంలో వారణాసి పట్టణానికి చేరువయ్యారు.

    'మసాన్‌' ప్రీమియర్‌ షోకి అత్యద్భుతమైన స్పందన లభించింది. ప్రదర్శనకు హాజరైన ప్రపంచ సినీ ప్రముఖులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. దాదాపు ఐదు నిమిషాల పాటు నిలబడి చప్పట్లు కొట్టి సినిమా చాలా చాలా బాగుందంటూ చిత్ర యూనిట్‌ని అభినందనలతో ముంచెత్తారు. నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిచాఛాదా ప్రధాన పాత్రలో నటించారు.

    'కేన్స్‌లాంటి ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో మా సినిమాని చూసి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం జీవితంలో మరచిపోలేని అనుభూతినిస్తోంది. సినిమా బాగుందని అందరూ అభినందిస్తుంటే కళ్ళు చెమర్చాయని' రిచాచద్దా ట్వీట్‌ చేశారు. ఒక చిన్న టౌన్‌లో నలుగురు వేర్వేరు వ్యక్తుల వైవిధ్యమైన కథలతో ఈచిత్రాన్ని నీరజ్‌ రూపొందించారు.

    నీరజ్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమాకి ఇంత అపూర్వ స్పందన రావడం పట్ల చిత్ర యూనిట్‌ అమితానందంతో ఉంది. 'మసాన్‌'కు వచ్చిన అద్భుత స్పందన కంట తడిపెట్టించిందని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్వీట్‌ చేశారు.

    English summary
    The trailer of Neeraj Ghaywan's directorial debut Masaan, which garnered much appreciation at the Cannes International Film Festival this year, was released in India on Friday. It shows the darker side of Indian society through the lives of two women.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X