twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరెన్సీ సమస్యే మాకూ వచ్చింది

    పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ మీలో ఎవరు కోటీశ్వరుడు. ఈ చిత్రాన్ని అ

    By Srikanya
    |

    ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెలలోనే చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాల్సి వుండగా, ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్‌ 23న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలని నిర్ణయించాం.

    ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్‌ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా మా బేనర్‌లో ఈ సినిమా మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అన్నారు. ఒక కంపెనీకి లాస్ వచ్చేలా మంచి ఐడియా ఇస్తే కోటి రూపాయలిస్తామంటూ పేపర్లో ఓ ప్రకటన వస్తుంది. దీని చుట్టూ అల్లిన స్టోరీనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'.

    నవీన్‌చంద్ర, శృతి సోధి, పృథ్వీ, సలోని, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్‌ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్‌, పిల్లా ప్రసాద్‌, గిరి, సన, విద్యుల్లేఖా రామన్‌, మీనా, నేహాంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్‌, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్‌ వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్‌, డైలాగ్స్‌ డెవలప్‌మెంట్‌: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్‌: గౌతమ్‌రాజు, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎం.ఎస్‌.కుమార్‌, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.

    English summary
    Prudhvi and Naveen Chandra as heroes and Saloni and Shruti Sodhi as heroines, a full length entertainer ‘Meelo Evaru Koteeswarudu’ is being made under Sri Satya Sai Arts banner. KK Radha Mohan is producing the film with E Sattibabu as director. The film has music by DJ Vasanth. The makers are planning to release the film on December 23rd.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X