twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగబాబు కామెంట్: చిరంజీవిపై అలా, పవన్ గురించి ఇలా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: చిరంజీవి, పవన్ కళ్యాణ్ చెరో దారిలో ప్రయాణిస్తున్నప్పటికీ మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరితో మంచి రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తూ వారధిగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరి గురించి ఆయన మరోసారి తన మనసులోని మాట బయట పెట్టారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఓపికగా తన అపీషియల్ పేజీలో సమాధానం ఇచ్చారు.

    Mega Brother Naga Babu about Chiranjeevi and Pawan Kalyan

    రాజకీయాలకు సంబంధించి చిరంజీవి వైపు ఎందుకు ఉన్నారు, పవన్ కళ్యాణ్ వైపు ఎందుకు లేరు అనే విషయమై ఆయన స్పందిస్తూ....‘నేను రాజకీయాల్లో అసలు లేను. చిరంజీవితో కలిసి ఇటీవల ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు. నేను తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉన్నపుడు ఇద్దరూ సహాయం చేసారు. ఇద్దరితో నాకు మంచి అనుబంధం ఉంది' అన్నారు.

    చిరంజీవి నాకు తండ్రి లాంటి వారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఉండక పోతే మా ఫ్యామిలీ ఇపుడు ఈ పొజిషన్లో ఉండేది కాదు. ఇప్పటికీ, ఎప్పటికీ ఆయన అంటే ఎనలేని గౌరవం, విధేయత ఉంటుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ అంటే కూడా ఎంతో ఇష్టం ఉంటుందని నాగబాబు తెలిపారు. అయితే అన్నయ్య చిరంజీవి వైపు ఉండాల్సిన బాధ్యత నాపై ఉంది..ఎందుకంటే ఆయన వల్లే నేను ఈ సినిమా ప్రపంచంలోకి వచ్చాను అని నాగబాబు చెప్పుకొచ్చారు.

    English summary
    "I consider Chiranjeevi as a father figure. If he hadn't come to film industry, none of us from our family would be in this position. I've always looked up to him with respect and admiration right from my childhood, although he's just four years elder to me. Nothing will change that equation and it's not that I like Pawan Kalyan any less" Naga Babu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X