మెగా పిచ్చి: బ్లేడుతో గొంతుకోసుకున్న అభిమాని (ఫోటో)

మెగా స్టార్ చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉండేదో పదేళ్ల క్రితం సంఘటనలు ఇంకా ఎవరూ మరిచిపోయి ఉండరు. అప్పట్లో కొన్ని సంఘటనలు చూస్తే చిరంజీవి అంటే మరీ ఇంత పిచ్చి ఏంట్రా అనుక

Posted by:
|

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉండేదో పదేళ్ల క్రితం సంఘటనలు ఇంకా ఎవరూ మరిచిపోయి ఉండరు. అప్పట్లో కొన్ని సంఘటనలు చూస్తే చిరంజీవి అంటే మరీ ఇంత పిచ్చి ఏంట్రా అనుకున్న సందర్భాలు అనేకం.

చిరంజీవి సినిమాలకు దూరమై పదేళ్లయింది. అయినా ఆయనపై అభిమానుల్లో అదే క్రేజ్, అదే పిచ్చి కంటిన్యూ అవుతుంది. తాజాగా విడుదలైన ఖైదీ నెం 150 సినిమాకు వస్తున్న రెస్పాన్సే అందుకు నిదర్శనం.

అయితే పదేళ్ల తర్వాత బాస్ థియేటర్లోకి వచ్చాడు....ఆయన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేక పోయాననే ఉద్వేగంలో ఓ అభిమాని తీవ్ర మనో వేదనకు, ఆగ్రహానికి గురై బ్లేడుతో గొంతు కోసుకున్న సంఘటన విశాఖలో చోటు చేసుకుంది.

 • విశాఖ రామా టాకీస్ వద్ద

  అభిమాని

  విశాఖ రామా టాకీస్ వద్ద

   

  ఈ ఘటన విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్ద కలకలం రేపింది. మద్యం మత్తులో బ్లేడుతో గొంతు కోసుకుని వీరంగం సృష్టించిన సదరు అభిమాని థియేటర్ వద్ద అందరినీ బెంబేలెత్తించాడు. మెడకు గాయమై రక్తమోడుతున్న అతన్ని ఆసుపత్రికి తరలించాలని థియేటర్ యాజమాన్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు.

   

 • టిక్కెట్ ఇవ్వాలంటూ గొడవ

  ఖైదీ నెం 150

  టిక్కెట్ ఇవ్వాలంటూ గొడవ

   

  తనకు టిక్కెట్ ఇస్తేనే ఆసుపత్రికి వెళతాను, లేకుంటే ఇక్కడే చచ్చిపోతాను అంటూ మూర్ఖంగా ప్రవర్తించిన అతన్ని చివరకు పోలీసులు రంగంలోకి దిగి అదుపు చేసారు. చిరంజీవి సినిమా విషయంలో ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నార

   

 • రెచ్చిపోయిన మెగా అభిమానులు... థియేటర్లో వీరంగం!

  ఫ్యానిజం

  రెచ్చిపోయిన మెగా అభిమానులు... థియేటర్లో వీరంగం!

  తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు..... తీరా థియేటర్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి చూసి కోపోద్రిక్తులయ్యారు. థియేటర్ మీద దాడి చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   

   

 • రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)

  రివ్యూ

  రైతులు..రత్తాలు... రక్త సింధూరం (చిరు 'ఖైదీ నంబర్‌ 150' రివ్యూ)

   

  నన్ను చూసి నవ్వేవాళ్ళు, ఏడ్చే రోజు వస్తుంది' అంటూ చిరంజీవి తన రియల్ లైఫ్ టచ్ డైలాగ్స్ తో...వెండితెరపైకి దూసుకువచ్చేసారు.... పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేయండి. 

Read In English

Mega fan cut his neck with blade for Khaidi no 150 movie tickets.
Please Wait while comments are loading...