»   » అలా ట్రైన్ లో నా 'ఫస్ట్‌నైట్' : చిరంజీవి

అలా ట్రైన్ లో నా 'ఫస్ట్‌నైట్' : చిరంజీవి

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నవ్వులకు పెట్టింది పేరు అల్లు రామలింగయ్య. ఇంకా మనతో జీవించేవున్నాడు అనడానికి కారణంగా ఇచ్చే పురస్కారం 'డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం'. 2015 సంవత్సరంకు గాను దర్శకేంద్రుడు డాక్టర్ కే రాఘవేంద్రరావుకి అవార్డును ప్రదానం చేశారు. ఈ ప్రదానోత్సవం కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య అల్లుడైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. నాకు 'ఫస్ట్‌నైట్' అరేంజ్ చేసింది మాత్రం రాఘవేంద్రరావు గారని చెప్పారు. రాఘవేంద్రరావు సినిమా అంటేనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది పూలు, పళ్లు, స్వీట్లే.

Megastar Chiranjeevi  about his train first night

'పెళ్లయిన కొత్తలో ఒకసారి సినిమా షూటింగ్ నిమిత్తం నేను, సురేఖ రైలులో మద్రాసుకు వెళ్తున్నాం. మేము రైలులో వెళ్తున్నా సంగతి తెలుసుకున్న డైరక్టర్ గారైన రాఘవేరారావు గారు మాకోసం రైలు బోగీలో పూలు, పళ్లు, స్వీట్లతో అచ్చం ఆయన సినిమాలోని ఫస్ట్‌నైట్ సీన్‌ను తలపించేలా డెకరేట్ చేయించారు.

ఇదంతా ఆయన ఒక్క ఫోన్ కాల్‌తో చేయించారు. ఇలాంటి ఫస్ట్‌నైట్ నేను నిజంగా ఎప్పుడూ చేసుకోలేదు. ఆ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను''. అని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

English summary
Chiranjeevi talked about his First night at Allu Ramalingaiah national award function at Hyderabad.
Please Wait while comments are loading...