twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆదుకోవడం నా అలవాటు, మీరూ ఆదుకోండి: మోహన్ బాబు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తెలుగు భాష మాట్లాడే ప్రజలందరూ బాధ్యతగా తుఫాను బాధితులకు సాయం అందించాలని సినీ నటుడు మోహన్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలోని శ్రీవిద్యానికేతన్‌ కళాశాలలో ఆయన మాట్లాడారు. ప్రజలకు కష్టనష్టాలు వచ్చినప్పుడు నటుడిగా ముందుండి వారిని ఆదుకోవడం తనకు అలవాటని చెప్పుకొచ్చారు.

    తన కుమారుడు, సినీహీరో మనోజ్‌, స్నేహితులు కలిసి సుమారు 30 లక్షలు వరకు తుఫాన్‌ బాధితుల కోసం సాయం చేశారన్నారు. శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది మొత్తం ఒక్క రోజు వేతనం తుఫాను బిధితులకు విరాళంగా ఇస్తున్నామని నటుడు విష్ణు పేర్కొన్నారు.

    Mohan Babu talks about Hud Hud Funds

    అదేవిధంగా విద్యార్థుల దగ్గర కూడా విరాళాలను సేకరించి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. తమ కళాశాల సీనియర్‌ విద్యార్థులను వైజాగ్‌కు తీసుకెళ్లి ప్రజలకు అవసరమైన సేవలందిస్తామని పేర్కొన్నారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు కష్టపడటం అభినందించదగ్గ విషయమన్నారు.

    English summary
    The donations for Hudhud cyclone victims are flooding in Chittoor District. Sri Vidyaniketan and Krishna Teja educational groups donated to the cyclone victims today. Mohan Babu speaking during the occasion appreciated Chandrababu 's commitment in carrying out the relief measures and said that his efforts are commendable. Mohan Babu added that he also takes initiative and stands in front during such natural calamities .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X