twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిగతావాళ్లకన్నా మోహన్ బాబు బెస్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తుఫానులు, వదలలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కళాకారులు స్పందించి తమకు చేతనైన సాయిం చేయటం జరుగుతూంటాయి. అయితే ఈ తరంలో అది కొరవడింది. కానీ సీనియర్ నటుడు మోహన్ బాబు వంటి వారు ఇంకా తమలో మానవత్వం ఉందని ప్రూవ్ చేస్తున్నారు. తుఫాన్ బాధితులకు ఆయన సాయం చేయటానికి నడుం బిగించారు.

    మోహన్ బాబు మాట్లాడుతూ... ''హుద్‌హుద్‌ తుపాను సృష్టించిన ప్రళయం చూసి మనసు కకావికలమైంది. అంచనాలకు అందని విధంగా నష్టం జరిగింది. నాలుగు జిల్లాలకి చెందిన లక్షలాది మంది ప్రజలు తుపానువల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీళ్లు, పాలు లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే తుపాను బాధితులకు సాయం అందించేందుకు నేను, నా మిత్రులు విశాఖపట్నం బయల్దేరాలని నిర్ణయించాం. కష్టకాలంలో ఒకరు ఒకరికి సాయపడినా ఎంతో ఆసరాగా ఉంటుందని నా అభిప్రాయం. ఇదివరకు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు నేను ప్రజల్లోకి వెళ్లాను. నా వంతుగా సాయం అందించాను'' అన్నారు.

    అలాగే....''మనకు రెండు కళ్లు ఎలాగో తెలుగు మాట్లాడే ప్రజలకు రెండు రాష్ట్రాలూ అంతే. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన ఘోరం ఎంతో బాధకి గురిచేసింది. అందుకే ఈ నెల 17న రావాల్సిన మనోజ్‌ 'కరెంటుతీగ' చిత్రాన్ని వాయిదా వేస్తున్నాం'' అన్నారు మోహన్‌బాబు.

    Mohana babu wants to help Hudhud affected people

    'హుద్‌హుద్‌' విలయం మిగిల్చిన భారీ నష్టం లెక్క తేలడం కష్టమే. ఈ నష్టం లెక్క తేలినా ప్రజల కన్నీళ్లను లెక్కించేందుకు ఏ కొలమానాలూ లేవు. పైకప్పులు ఎగిరిన ఇళ్లు.... నేలరాలిన తోటలూ... నీటమునిగిన పంటలూ... కళ్ల ముందే ఛిద్రమైపోతున్న జీవనోపాధిని తలచుకొంటూ నీళ్లు ఇంకిన కళ్లతో బాధితులు ఆందోళనలో మునిగిపోయారు. నీట మునిగిన ఇళ్ల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లేందుకు మార్గం కూడా లేని పరిస్థితులు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి. చిన్నారులకు అవసరమైన పాలు, నీళ్లు; ప్రజలకు కావల్సిన నిత్యావసరాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లకు లోనవుతున్నారు.

    ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యల నిమిత్తం ప్రత్యేకంగా అయిదు బృందాలను ఏర్పాటు చేసింది. పునరావాస శిబిరాల్లోనే కాకుండా ఇళ్లలో చిక్కుకుపోయినవారికీ ఆహారం, మంచినీరు అందే ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 44 మండలాలపై హుద్‌హుద్‌ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 2.5 లక్షల మంది పౌరులు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు.

    English summary
    Mohan Babu says, “Telugu people of two states are important to me and my family. I have always come forward to help people whenever such devastations have happened. My family and I, along with my fans, will soon be visiting Vizag and help those in need,” he adds.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X