twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుకోకుండా షాక్ రిలీజ్ నెలరోజులు వాయిదా :డిసెంబర్ లోనే మన్యం పులి(లేటెస్ట్ స్టిల్స్)

    |

    మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్ తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జోరున కొనసాగతోంది. ఇప్పటివరకు 100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్ లోనే కాదు మోహన్ లాల్ కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పులిమురుగన్. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖనిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల రిత్య వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. అలానే డిసెంబర్ నెలలో మరో విడుదల తేదీని ఫిక్స్ చేసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

    జనతా గ్యారేజ్ సినిమాతో తెలుగులో మోహన్ లాల్ మల్లూవుడ్ లో చేసిన పులి మురుగన్ సినిమాతో మరోసారి తన విశ్వరూపాన్ని చూపాడు. దసరా కానుకగా మలయాళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్స్ రాబడుతుంది. మల్లూవుడ్ చరిత్రలోనే అల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన పులి మురుగన్ సినిమా త్వరలోనే తెలుగులో సందడి చేయనున్నది. ఈ చిత్రాన్ని 'మన్యం పులి'గా తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. 'సౌత్‌ ఇండియా నుంచి 'బాహుబలి' తర్వాత మళ్లీ ఆ రేంజ్‌లో సక్సెస్‌ అందుకున్న చిత్రమిది. కలెక్షన్ల పరంగా మాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇప్పుడు తెలుగులోకి కూడా రానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాలనివ్వనుందీ, మన తెలుగు సినిమా మార్కెట్ లో మోహన్ లాల్ సినిమా ఎంతమేరకు ప్రభావం చూపనుందీ..?? ఈ అంశాల నేపథ్యం లో మన్యం పులి గా రానున్న పులి మురుగన్ పై చిన్న లుక్

     పులి మురుగన్:

    పులి మురుగన్:


    తమిళ చిత్రాలు అనువాదాలుగా తెలుగులోకి అడుగుపెడుతుండటం .. ఇక్కడ ఘన విజయాలను అందుకుంటూ ఉండటం చాలాకాలంగా జరుగుతూ వస్తోంది. అలాగే తాజాగా 'పులి మురుగన్' అనే భారీ తమిళ చిత్రం, తెలుగులోకి అనువాదంగా రానుంది.తమిళంలో దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా, అక్కడ అత్యధిక వసూళ్లను సాధించింది. మోహన్ లాల్ కెరియర్లోనే భారీ విజయాన్ని అందించిన చిత్రంగా నిలిచింది.

     మన్యం పులి:

    మన్యం పులి:


    అలాంటి ఈ సినిమాకి తెలుగులో 'మన్యం పులి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. జగపతిబాబు .. కమలిని ముఖర్జీ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, తెలుగులోనూ విజయవిహారం చేయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    భారీ కలెక్షన్స్:

    భారీ కలెక్షన్స్:

    ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్ తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జోరున కొనసాగతోంది. ఇప్పటివరకు 100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్ లోనే కాదు మోహన్ లాల్ కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పులిమురుగన్. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖనిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి ‘మన్యం పులి' పేరిట విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే.
     డిసెంబర్ నెలలో:

    డిసెంబర్ నెలలో:


    అయితే నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితులరీత్య వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. అలానే డిసెంబర్ నెలలో మరో విడుదల తేదీని ఫిక్స్ చేసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

     సింధూరపువ్వు:

    సింధూరపువ్వు:


    కృష్ణారెడ్డి గతంలో అనువాద సినిమాగా సింధూరపువ్వు ని విడుదల చేసి ఘన విజయాన్ని అందుకోవడంతో సిందూరపువ్వు కృష్ణారెడ్డిగా తెలుగునాట ప్రాముఖ్య పొందారు. ఆ తర్వాత అయన విడుదల చేసిన మరొక అనువాద సినిమా సాహసఘట్టం కూడా భారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ‘పులిమురుగన్' చిత్రాన్ని సైతం కృష్ణారెడ్డి తెలుగునాట పెద్ద హిట్ చేస్తారని మళయాల వెర్షన్ నిర్మాత తోమిచమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

     కమలినీ ముఖర్జీ:

    కమలినీ ముఖర్జీ:


    అలానే మల్లూవుడ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న మోహన్ లాల్ ‘పులి మురుగన్'.. ‘మన్యంపులి'గా తెలుగునాట కూడా తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగు చిత్ర పరిశ్రమ భావిస్తోంది. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించటం కూదా మరో చెప్పుకోదగ్గ విషేషం..

     పులి వేట:

    పులి వేట:


    అటవీ సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తాడు అతను అడవికి వెళ్లినప్పుడు పలు జంతువులతో ముఖ్యంగా పులులతో పోరాడాల్సి వస్తుంది. పులి వేటలో నిష్ణాతుడైన ఓ మనిషి కథ మన్యం పులి. అలాంటి వ్యక్తి సమాజంలోని కొందరు అవినీతిపరులపై ఎలాంటి పోరాటం సాగించాడు? అందుకు గల కారణమేమిటి? అనేది సినిమాలో ఆసక్తిని కలిగిస్తుంది. ఆ క్రమంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారట.

     పులిమురుగన్:

    పులిమురుగన్:


    మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 15 కోట్లకి పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ విజువల్ వండర్.

     రెండు సంవత్సరాలు:

    రెండు సంవత్సరాలు:


    'జనతా గ్యారేజ్' సినిమాతో మోహన్ లాల్ కి తెలుగునాట ఫుల్ క్రేజ్ రావడంతో, అదే...ఊపులో 'మన్యంపులి' సైతం భారీ విజయాన్ని అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సాధ్యమైనంత త్వరగా నవంబర్ లో 'పులి మురుగన్' తెలుగు వెర్షన్ 'మన్యం పులి' ని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత కృష్ణా రెడ్డి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలు పాటుఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.

     టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు:

    టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు:


    ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకుంటోన్న ‘మన్యం పులి' తెలుగులో సైతం సెంట్ పర్సెంట్ సక్సెస్ అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. .దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీసుందర్, కెమెరా : షాజీ

    English summary
    Mohan lal "Manyam Puli" team palnned to release the movie on November 25th, but due to present uncertain situations the makers are planning to release the project in Decemeber first week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X