»   » బెంగుళూరులో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? (ఫోటో)

బెంగుళూరులో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? (ఫోటో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్... ప్రస్తుతం తెలుగు నాట హాట్ టాపిక్. గోపాల గోపాల సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏ సినిమా షూటింగులోనూ పాల్గొనలేదు. ఆయన తర్వాత సినిమా ‘గబ్బర్ సింగ్-2' షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఆయన లేకుండానే మొదలైంది. జూన్ మొదటి వారంలో ఆయన షూటింగులో జాయిన్ కావాల్సి ఉన్నా ఇంకా లేదు.

ఆ మధ్య పవన్ రాజకీయాలు, రైతులు అంటూ హడావుడి చేసినా మళ్లీ కొన్ని కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. అసలు ప్రస్తుతం ఆయన ఇటు సినిమాల్లోనూ నటించగా, ఇటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా లేక ఏం చేస్తున్నారనే విషయం హాట్ టాపిక్ అయింది. ఓ వైపు రాష్ట్రంలో పవన్ కళ్యాన్ మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఓటుకు నోటు వ్యవహారంలో కొట్టుమిట్టాడుతున్నా పవన్ కళ్యాణ్ స్పందించక పోవడం చర్చనీయాంశం అయింది.

ఇటు సినిమాల పరంగాను, అటు రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ ఇపుడు రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా మారాను. అంతటా ఆయన గురించే చర్చ. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత వారం బెంగుళూరులోని జిమ్ వద్ద దర్శనమిచ్చారు. భారీ గడ్డంతో ఉన్నారు. అసలు ఆయన అక్కడ ఏం చేస్తున్నారనేది తెలియడం లేదు.

కొందరేమో ఆయన తన తర్వాతి సినిమా ‘గబ్బర్ సింగ్-2' కోసం బాడీ బిల్డప్ చేస్తున్నారని అంటున్నారు. జూన్ 25 నుండి ‘గబ్బర్ సింగ్-2' సినిమా షూటింగులో పాల్గొంటారని అంటున్నారు. మరికొందరేమో ఆయన తన మామిడి తోటల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుండి పలువురు ప్రముఖులకు ఇప్పటికే మామిడి పండ్లు అందాయి.

పవన్ కళ్యాణ్

గత వారం బెంగుళూరులోని ఓ జిమ్ వద్ద పవన్ కళ్యాణ్ దర్శనమిచ్చారు.

నితిన్

ఇటీవలే నితిన్ కు పవన్ కళ్యాన్ తోట నుండి మామిడి పళ్లు వచ్చాయి.

బాబీ

గబ్బర్ సింగ్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న బాబీ కూడా మామిడి పళ్లు అందుకున్నారు.

హరీష్ శంకర్

గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా మామిడి పళ్లు అందుకున్నారు.

బ్రహ్మాజీ

ప్రముఖ నటుడు బ్రహ్మాజీకి కూడా పవన్ తోటలోని మామాడి పళ్లు అందాయి.

Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos