»   » కాటమరాయుడిపై పెరుగుతున్న క్రేజ్.. బ్లాక్ బస్టర్ అని జోస్యం చెప్పిన బండ్ల గణేశ్

కాటమరాయుడిపై పెరుగుతున్న క్రేజ్.. బ్లాక్ బస్టర్ అని జోస్యం చెప్పిన బండ్ల గణేశ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న కాటమరాయుడు సెన్సార్ కార్యక్రమాలను బుధవారం పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రం 24న విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

కాటమరాయుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది క్రేజ్ రెట్టింపవుతున్నది. కబాలి చిత్రానికి వచ్చిన విధంగా స్పందన వస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లోనూ కాటమరాయుడు పోస్టర్లు ఇప్పటికే వెలిశాయి. బస్సులపైనా భారీ పోస్టర్లు కనిపిస్తున్నాయి. బుధవారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది.

 పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి

పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి

దర్శకుడు కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో రూపొందుతున్న కాటమరాయుడు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు ముస్తాబవుతున్నది. ఇటీవలే ఇటలీలో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకొని వచ్చిన సంగతి తెలిసిందే.

 సెన్సార్ యూ సర్టిఫికెట్ జారీ

సెన్సార్ యూ సర్టిఫికెట్ జారీ

కాటమరాయుడు చిత్రం బుధ, గురువారాల్లో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు అధికారులు యూ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా నిడివి 144 (2 గంటల 24 నిమిషాలు) నిమిషాలు ఉన్నట్టు సమాచారం.

 గ్యారంటీగా బ్లాక్ బస్టర్

గ్యారంటీగా బ్లాక్ బస్టర్

కాటమరాయుడు చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నదని నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ గణేష్ డిసైడ్ చేశారు. సినిమా ఘనవిజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

18న ప్రీరిలీజ్.. 24న రిలీజ్

18న ప్రీరిలీజ్.. 24న రిలీజ్

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 18న నిర్వహించేందుకు నిర్మాత శరత్ మరార్ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కాటమరాయుడు మార్చి 24న విడుదలయ్యేందుకు ముస్తాబవుతున్నది.

నటీనటులు వీరే..

నటీనటులు వీరే..

ర్త్‌స్టార్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో శివ బాలాజీ, కమల్ కామరాజు, అజయ్, అలీ, రావు రమేశ్, వేణు మాధవ్, నాజర్, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

English summary
Powestar Pawan Kalyan's Katamarayudu completed its censor formalities on Wednesday and was granted a clean 'U' certificate. The actioner will have a grand worldwide release on 24th March.
Please Wait while comments are loading...