twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎం.ఎస్.ధోనీ.... మూవీ అసలు ఉద్దేశ్యం అదే, క్రికెటర్ ధోనీ వివరణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టీమిండియా క్రికెటర్‌ ఎమ్‌.ఎస్‌. ధోని జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ 'ఎమ్‌.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన తొలి వారం పూర్తయిన సందర్భంగా క్రికెటర్ ధోనీ స్పందించారు.

    ఈ తరం యువత ఈ సినిమా చూసి స్ఫూర్తి పొందాలని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో.... తెలియజేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులకు ధోనీ ధన్యవాదాలు తెలిపారు.

     బాక్సాఫీస్

    బాక్సాఫీస్

    'ఎంఎస్.ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ' కి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు(శుక్రవారం) రూ. 21.30 కోట్లు వసూలు చేసిన ఈచిత్రం...తొలి వారం పూర్తయ్యే సమయానికి రూ. 100 కోట్లకు చేరువైంది.

     తొలి వారం వసూళ్లు

    తొలి వారం వసూళ్లు

    ధోనీ మూవీ తొలి వారం రూ. 94.13 కోట్లు వసూలు చేసింది. ఎలాంటి స్టార్స్ లేక పోయినా కేవలం ధోనీ మీద అభిమానం వల్లే సినిమాకు ఇంత భారీగా వసూళ్లు వచ్చాయని అంటున్నారు.

     రోజు వారి వసూళ్ల వివరాలు

    రోజు వారి వసూళ్ల వివరాలు

    సినిమా విడుదలైన తొలిరోజు శుక్రవారం రూ. 21.30 కోట్లు వసూలవ్వగా... శనివారం రూ. 20.60 కోట్లు, ఆదివారం రూ. 24.10 కోట్లు, సోమవారం రూ. 8.51 కోట్లు, మంగళవారం రూ. 7.52 కోట్లు, బుధవారం రూ. 6.60 కోట్లు, గురువారం రూ. 5.50 కోట్లు వసూలైంది.... మొత్ం రూ. 94.13 కోట్ల వచ్చాయి. త్వరలో రూ. 100 కోట్లను అందుకుంటుందని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు.

     సౌత్ లో

    సౌత్ లో

    సాధారణంగా బాలీవుడ్ సినిమాలు సౌత్ లో పెద్దగా ఆడవు. అయితే క్రికెట్ గా ధోనికి మంచి క్రేజ్ ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇతర సౌతిండియా స్టేట్స్ లో కూడాఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తోంది.

    English summary
    Trade analyst Taran Adarsh tweeted, “#MSDhoniTheUntoldStory Fri 21.30 cr, Sat 20.60 cr, Sun 24.10 cr, Mon 8.51 cr, Tue 7.52 cr, Wed 6.60 cr, Thu 5.50 cr. Total: ₹ 94.13 cr.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X